వంద రోజుల్లో జగన్ ను ప్రజలు తరిమేస్తారు..: అచ్చెన్నాయుడు

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు.దళిత ఉద్యమ నేత కొలికపూడి పట్ల ప్రభుత్వ వేధింపులు దుర్మార్గమని విమర్శించారు.

హైదరాబాద్ లోని కొలికపూడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఏపీ సీఐడీ అధికారులు భయభ్రాంతులకు గురి చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.అంతేకాకుండా 11 ఏళ్ల చిన్నారికి సైతం నోటీసులు ఇస్తామని బెదిరించడం అమానవీయమని పేర్కొన్నారు.

అవినీతి, అరాచకాలను ప్రశ్నించడమే కొలికపూడి చేసిన నేరమా అని ప్రశ్నించారు.ఈ క్రమంలోనే మరో వంద రోజుల్లో జగన్ ను ప్రజలు తరిమేయడం ఖాయమని తెలిపారు.

ఏపీలో ఈసారి టీడీపీ - జనసేన ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు