న‌డుము నొప్పి వేధిస్తుందా? అయితే ఈ అల‌వాట్ల‌ను వెంట‌నే వ‌దులుకోండి!

న‌డుము నొప్పి.నేటి ఆధునిక కాలంలో దాదాపు అంద‌రూ ఏదో ఒక స‌మ‌యంలో ఈ స‌మ‌స్య‌ను ఫేస్ చేసే ఉంటారు.

గంట‌లు త‌ర‌బ‌డి కూర్చుని ఉండటం లేదా నిల‌బ‌డి ఉండ‌టం, కండ‌రాల బ‌ల‌హీన‌త‌, ఎముక‌ల సాంద్ర‌త త‌గ్గ‌డం, మూత్ర‌పిండాల్లో రాళ్లు, ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలిలో మార్పులు వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల న‌డుము నొప్పి కొంద‌రిని త‌ర‌చూ ఇబ్బంది పెడుతుంటుంది.ఈ జాబితాలో మీరు ఉంటే.? వెంట‌నే కొన్ని అల‌వాట్ల‌ను వ‌దులుకోవాల్సి ఉంటుంది.మ‌రి ఆ అల‌వాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రోటీన్.మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అతి ముఖ్య‌మైన పోష‌కం ఇది.ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే శ‌రీరానికి రెగ్యుల‌ర్‌గా ప్రోటీన్‌ను అందించాలి.ఈ కార‌ణంతోనే కొంద‌రు అవ‌స‌రం అయిన దానికంటే అధికంగా ప్రోటీన్‌ను తీసుకుంటుంటారు.ఈ అల‌వాటు మ‌న‌లో చాలా మందికి ఉంటుంది.

అయితే ప్రోటీన్‌ను ఓవ‌ర్‌గా తీసుకుంటే ఎముక‌ల ఆరోగ్యం దెబ్బ తింటుంది.ఫ‌లితంగా న‌డుము నొప్పి వంటి ఎన్నో స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడ‌తాయి.

Advertisement

కాబ‌ట్టి, అధికంగా ప్రోటీన్ తీసుకునే అల‌వాటు ఉంటే వ‌దులుకోండి.అలాగే కొంద‌రు ప్ర‌తి రోజు గ్యాస్ సంబంధిత‌ మందుల‌ను వాడుతుంటారు.

మీకు ఈ అల‌వాటు ఉందా.? అయితే ఇక‌పై ఆ మందుల‌ను వాడ‌టం వ‌దులుకోండి లేదా త‌గ్గించుకోండి.త‌ర‌చూ న‌డుము నొప్పి, మోకాళ్ల నొప్పి, కండరాల తిమ్మిరి వంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌డానికి ఆయా మందుల వాడ‌కం కూడా ఒక కార‌ణ‌మే.

కాఫీ, ఎనర్జీ డ్రింక్స్, సోడాలు, డార్క్ చాక్లెట్ వంటి అధిక కెఫీన్ ఆహారాల‌ను మరియు పానీయాలను రోజూ తీసుకునే అల‌వాటు చాలా మందికి ఉంటుంది.అయితే త‌ర‌చూ నడుము నొప్పితో ఇబ్బంది ప‌డే వారు మాత్రం ఆయా ఆహారాల‌ను, పానీయాల‌ను పూర్తిగా ఎవైడ్ చేయాలి.మ‌రియు కార్బోనేటేడ్ పానీయాలను సైతం దూరం పెట్టాలి.

ఎందుకంటే, ఇవి న‌డుము నొప్పిని మ‌రింత తీవ్రత‌రం చేస్తాయి.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?
Advertisement

తాజా వార్తలు