శాంతిభద్రతల పరిరక్షణకై ప్రజలు సహకరించాలి:ఆర్ఏఎఫ్ ఏడిసిపి వినోద్ గోపి

యాదాద్రి భువనగిరి జిల్లా: శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు ప్రజలు సహకరించాలని, ప్రజలకు సేవ చేయడానికి పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఆర్ఎఎఫ్ ఏడిసిపి వినోద్ గోపి అన్నారు.సోమవారం డిసిపి రాజేష్ చంద్ర,ఏసిపి రమేష్,సిఐ కొండల్ రావుల ఆదేశాలతో యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ నుండి గ్రామ పంచాయతీ వరకు సిఆర్పీఎఫ్ మరియు రాపిడ్ యాక్షన్ పోర్స్ తో కవాతు నిర్వహించారు‌.

 People Should Cooperate To Maintain Law And Order: Raf Adcp Vinod Gopi, Yadadri-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఎలాంటి గొడవలు జరిగినా 100 నెంబర్ కు పోన్ చేసి సమాచారం అందించాలని,మతపరమైన గోడవలు జరుగకుండా ప్రజలు సహకరించాలని కోరారు.ఈ సందర్బంగా ప్రెండ్లీ పోలీసింగ్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కళాజాత బృందం ఈ నెల 4 నుండి 10 వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించి ప్రజలను చైతన్యం చేస్తున్నట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో ఆర్ఎఎఫ్ ఇన్స్పెక్టర్స్ పిఎస్ పూజారి,బి.

రాజు, సబ్ ఇన్స్పెక్టర్స్ నరసింహులు,చందు, మోటకొండూర్ ఎస్ఐ పాండు,ఎఎస్ఐ లింగం గౌడ్,ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్,సిపిఐ జిల్లా సహయ కార్యదర్శి బోలగని సత్యనారాయణ, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube