ఏడేళ్ల పాపను చూసి ఆశ్చర్యపోతున్న Paytm CEO... ఎందుకంటే?

మనిషికి తన సంపాదనలో కొంత అవసరాలనిమిత్తంపోను మిగతాది దాచుకోవడం అనాదిగా వస్తున్న అలవాటు.

ఈ క్రమంలో భారత్‌లో మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.

ఈ విషయంలో పెద్దవాళ్లకు ఓ అవగాహన ఉంటుంది సరే.తాజాగా MFలపై ఓ చిన్న పాపకు ఉన్న అవగాహన పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.తాజాగా ఆ చిన్నారికి Paytm CEO విజయ్‌ శేఖర్‌ శర్మ సైతం ముగ్ధుడయ్యాడు.

అవును, స్వాతి దుగర్‌ అనే ట్విటర్‌ యూజర్‌ తన ఏడేళ్ల కూతురు మ్యూచువల్‌ ఫండ్లపై మాట్లాడుతున్న ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.అది అక్కడకు ఇక్కడకు చేరి చివరకు విజయ్‌ శేఖర్‌ శర్మ కంటపడింది.

దాంతో సదరు వీడియోని ఆయన తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు."దీపావళికి నగదు రూపంలో అందిన బహుమతుల్ని నా కూతురు ఏం చేయబోతోందంటే!" అనే శీర్షికతో స్వాతి ఈ వీడియోను పంచుకోగా దాంట్లో మ్యూచువల్‌ ఫండ్లు అంటే ఏంటి? ఎంతకాలం మదుపు చేయాలి వంటి అంశాలను ఆ చిన్నారి చక్కగా వివరించింది.

Advertisement

ఆ చిన్నారి మాట్లాడుతూ."నా పాకెట్ మనీని నా ఖాతాలో పొదుపు చేస్తాను.తరువాత వాటిని MFలలో మదుపు చేస్తున్నాను.

మ్యూచువల్‌ ఫండ్లను నిర్వహించేవారికి ఏ కంపెనీ బాగా రాణిస్తుంది.ఏ కంపెనీ నష్టాలను మూటకట్టుకుంటుందో బాగా తెలుసు.

నేనిచ్చిన డబ్బును వాళ్లు లాభాలిచ్చే కంపెనీలో మదుపు చేస్తే నా డబ్బు బాగా పెరుగుతుంది" అని వివరించడం ఆ పాపకు ఆర్థిక అంశాలపై ఉన్న బలమైన అవగాహనను తెలియజేస్తోంది అని ఆయన పేర్కొన్నారు.ఈ క్రమంలో ఎంతకాలం MFలలో ఇన్వెస్ట్‌ చేయాలని తల్లి అడగ్గా.

ఆలోచించి 10 ఏళ్లు అని సమాధానం చెప్పింది.ఆ పాప మాటలకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.

పైసా ఖర్చు లేకుండా ముఖంపై మచ్చలను పోగొట్టుకోవాలనుకుంటే ఇలా చేయండి!
Advertisement