వివాహం అనేది మనిషి జీవితంలో ఒక్కసారే జరుగుతుంది.కాబట్టి దానిని ఎంతో మధుర జ్ఞాపకంలాగా మలుచుకోవాలనుకుంటారు.
పైగా మనసులు కలిసిన జంట మనువాడితే ఆ కిక్కే వేరే ఉంటుంది.అలాంటి జంట వివాహ వేదికపై వధువు కోసం వరుడు చేసిన సర్‌ప్రైజ్ చూసి వధువుతో సహా ఆహుతులు అందరూ ఆశ్చర్యపోయారు, ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.
అవును, పెండ్లి మండపంలో వధువుకు స్వీట్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన వరుడు డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న ఆమె విద్యార్ధులను పిలిచి ఆమెని ఆనందింపజేసాడు.
సరిగ్గా రింగు తొడిగే సమయానికి వారిని ముచ్చటగా తయారై వెడ్డింగ్ రింగ్స్, పూలను తీసుకురావాలని ముందే చెప్పాడు.
దాంతో ఆ సమయానికి వారు విచ్చేయగా వివాహ వేదికలో ఒక్కసారిగా తన స్టూడెంట్స్‌ను చూసిన వధువు భావోద్వేగానికి గురైంది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ ఒక్క ఘటనతో వరుడు వధువు మనసుని దోచుకున్నాడు.భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక వరుడు కౌగిలి లోగిలిలో వాలింది.

ఇకపోతే, ది ఫిజెన్ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేయగా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఇప్పటివరకూ దాదాపుగా 25 లక్షల మంది వీక్షించగా యూజర్లు సైతం భావోద్వేగానికి గురై కొత్త జంటకు యూజర్లు అభినందనలు తెలుపుతున్నారు.డౌన్ సిండ్రోమ్ కలిగిన వధువు విద్యార్ధులకు రింగ్స్ తీసుకువచ్చే బాధ్యతను పెండ్లి కొడుకు అప్పగించాడు అని పోస్ట్‌కు క్యాప్షన్‌గా ఇక్కడ చూడవచ్చు.ఇక సదరు వీడియోకి లైక్స్ అయితే లెక్కే లేదు.
మీరు కూడా ఆ వీడియోని తిలకించి అభిప్రాయాన్ని తెలియజేయండి.







