ఆర్ ఎక్స్ 100 సినిమా( RX 100 movie )తో సంచలన విజయం సాధించిన డైరెక్టర్ అజయ్ భూపతి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా తెలుసు.ఈయన అప్పటి నుండి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
సైలెంట్ గా వచ్చి ఆర్ ఎక్స్ 100 సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.ఈ సినిమాతో బోల్డ్ లవ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసాడు.
అయితే ఈ సినిమా విజయం తర్వాత మరో సినిమా హిట్ అందుకోలేదు.
మహాసముద్రం అంటూ ఒక సినిమాతో వచ్చాడు.కానీ ఇది ప్లాప్ అయ్యింది.అజయ్ భూపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో కాస్త ఢీలా పడ్డాడు.
కానీ తన ప్రయత్నం ఆపకుండా మరోసారి ప్రేక్షకుల ముందుకు ”మంగళవారం”( Mangalavaaram ) సినిమాతో రాబోతున్నాడు.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి అంచనాలు బాగానే క్రియేట్ అయ్యాయి.
ఎందుకంటే ఈ సినిమా టైటిల్ కు తగ్గట్టే అనౌన్స్ మెంట్ నుండి టీజర్ వరకు అన్ని కూడా మంగళవారం రోజునే ప్రకటించాడు.ఇక ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా మంగళవారం రోజునే ప్రకటించి తన సెంటిమెంట్ ను మళ్ళీ రిపీట్ చేసాడు.ఈ సినిమా కోసం థ్రిల్లర్ లవర్స్ ఎదురు చూస్తుండగా ఈ రోజు రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు.ఆసక్తి కలిగించే పోస్టర్ తో రిలీజ్ డేట్ ను నవంబర్ 17న రిలీజ్ చేయనున్నాడు.
సౌత్ ఇండియా భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు కన్ఫర్మ్ చేసారు.ఈ సినిమాలో పాయల్ రాజపుత్ ( Payal Rajput )ప్రధాన పాత్రలో నటించింది.
ఆర్ఎక్స్ 100 కాంబోను రిపీట్ చేస్తున్నట్టే ఆ హిట్ ను కూడా రిపీట్ చేస్తారో లేదో చూడాలి.ఇక ఈ సినిమాకు కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్( Ajanish Loknath ) సంగీతం అందిస్తుండగా మధుర మీడియా వర్క్స్, ఏ క్రియేటివ్ వర్క్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.