మంచి హైట్, మంచి పర్సనాలిటీ ఉన్న ప్రభాస్ ( Prabhas ) ని చూడగానే ఏ అమ్మాయి అయినా ఆయనకు ఇట్టాగే పడిపోతుంది.కేవలం సామాన్య అమ్మాయిలే కాదు హీరోయిన్స్ కూడా ఆయన అంటే చాలా అభిమానం చూపిస్తూ ఉంటారు.
ఆయన చేసే సినిమాలలో చిన్న హీరోయిన్ గా అవకాశం వచ్చినా కూడా వదులుకోరు.అటువంటి వారిలో పాయల్ రాజ్పుత్ ( Payal Rajput ) ఒకరిని చెప్పాలి.

ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన పాయల్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.తొలి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.కానీ ఆర్ఎక్స్ 100 ( RX100 movie )ఇచ్చినంత గుర్తింపు ఏ సినిమాలు తనకు ఇవ్వలేదు.అయినా కూడా అవకాశాలు అందుకుంటూనే ఉంది ఈ బ్యూటీ.
కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా సినిమాలు చేస్తూ పోతుంది.ఈమధ్య ఆచితూచి అడుగులు వేస్తుంది.
తొందరపడి కంటెంట్ ను ఒప్పుకోకుండా మంచి కంటెంట్ వస్తేనే సినిమాలకు ఓకే చెబుతుంది.ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.
నిత్యం ఫోటో షూట్ లు చేయించుకుంటూ బాగా రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది.

కెరీర్ మొదట్లో బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తర్వాత సన్నగా మారి మంచి ఫిజిక్ తో పాటు అందాన్ని కూడా పెంచుకుంది.ఇక ఈ బ్యూటీ ఒక వ్యక్తితో ప్రేమలో కూడా ఉండగా అతనితో ప్రస్తుతం సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది.అతనితో కలిసి దిగిన ఫోటోలను కూడా బాగా షేర్ చేస్తూ ఉంటుంది.
ఏమాత్రం మొహమాటం పడకుండా రొమాంటిక్ ఫోటోలను కూడా పంచుకుంటుంది.

ఇదంతా పక్కన పెడితే తను మంగళవారం అనే సినిమాలో నటించగా ఆ సినిమా టీజర్ విడుదల అయింది.ఇక ఆ టీజర్ ప్రేక్షకులందరికీ బాగా ఆకట్టుకున్నట్లు కనిపించింది.దీంతో ఆ సినిమా కోసం వెయిటింగ్ అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు.
ఇక టీజర్ విడుదలైన సందర్భంగా తను తన ఫాలోవర్స్ తో కాసేపు ముచ్చట్లు పెట్టింది.సినిమా గురించి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పుకుంటూ వస్తుంది.
అంతేకాకుండా తన పర్సనల్ విషయాలను కూడా చెప్పేస్తుంది.ఇక ఓ నెటిజన్ ప్రభాస్ గురించి అడగటంతో తనకు ప్రభాస్ తో మంగళవారం సినిమా ( Mangalavaram movie )చూడాలని డ్రీమ్ ఉందని తెలిపింది.
ఇక ప్రస్తుతం ఆమె పంచుకున్న స్టోరీ బాగా వైరల్ అవుతుంది.ఇక ఆమె ప్రభాస్ పై చూపిస్తున్న అభిమానాన్ని చూసి ప్రభాస్ అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఇక పాయల్ ఈ సినిమాతో పాటు మరిన్ని సినిమాలు కూడా సైన్ చేసినట్లు తెలిసింది.ఇక తనకు మంగళవారం సినిమా మంచి సక్సెస్ అందిస్తే మాత్రం తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ ఇదే అని చెప్పొచ్చు.
రీసెంట్ గా మాయ పేటిక సినిమాతో ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.