రెండో దశ వారాహి విజయ యాత్ర( Varahi Vijaya Yatra ) ఏపీలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.ఈ యాత్ర ప్రారంభంలోనే ఏలూరు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వాలంటీర్ల వ్యవస్థ పై చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపటం తెలిసిందే.
మహిళాల అక్రమ రవాణాకు వాలంటీర్లు పాల్పడుతున్నారని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ విషయం కేంద్ర నిఘా వర్గాలు తనకు చెప్పినట్లు పేర్కొన్నారు.
పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు రెండో దశ వారాహి యాత్ర చివరి బహిరంగ సభ తణుకులో( Tanuku ) సైతం మరోసారి వాలంటీర్లపై పవన్ విరుచుకుపడ్డారు.సీఎం జగన్ స్వలాభం కోసం వాలంటీర్లు పనిచేస్తున్నారని ఆరోపించారు.705 కోట్ల రూపాయల డబ్బు.

వాలంటీర్లకు( Volunteers ) ఇస్తున్న జగన్ ఉద్యోగస్తులకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు.వాలంటీర్లకు ఎందుకు వైసీపీ కండువాలు కప్పుతున్నారని కూడా ప్రశ్నించారు.ప్రజలకు మంచి చేయాలి అనే మనసు లేనప్పుడు ఎన్ని చట్టాలు కొత్త వ్యవస్థలు తీసుకొచ్చిన పనిచేయవు అని సీఎం జగన్ పై మండిపడ్డారు.
దీంతో మరోసారి వాలంటీర్ల పై పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.పరిస్థితి ఇలా ఉండగా మొదటి దశ మాదిరిగానే రెండో దశ వారాహి యాత్ర కూడా విజయవంతం కావడంతో జనసేన నేతలు సంతోషంగా ఉన్నారు.
రెండో దశ వారాహి యాత్ర జూలై 9వ తారీకు ప్రారంభమైంది.ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకులో భారీ బహిరంగ సభలలో పవన్ ప్రసంగించడం జరిగింది.







