పవన్ ఆ లుక్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.. మరి 'ఓజి'తో ఆ కోరిక తీరుస్తాడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజి.

పవర్ స్టార్ లైనప్ లో అన్నిటి కంటే చివరిగా ప్రకటించిన కూడా అన్ని ప్రాజెక్ట్స్ కంటే ముందుగానే పవన్ దీనిని పూర్తి చేస్తున్నాడు.

ఇప్పటికే దాదాపు 60 శాతం పూర్తి కావొస్తుంది.ప్రజెంట్ ఈ సినిమా షూట్ లోనే పవన్ బిజీగా ఉన్నారు.

పవన్ ఈ సినిమాపై ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడంతో ఫ్యాన్స్ మరింత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు.ఈ సినిమా పవన్ కెరీర్ లోనే మైలురాయిగా నిలిచి పోతుందని అంటున్నారు.

ఇక పవన్ ను సుజీత్ చాలా స్టైలిష్ గా ప్రజెంట్ చేయబోతున్నాడని ఫ్యాన్స్ కోసం సిక్స్ ప్యాక్ కూడా చూపించ బోతున్నాడని ఇప్పటికే టాక్ వచ్చింది.

Advertisement

మరి తాజాగా ఫ్యాన్స్ కోరుకునే విషయం ఓజి సినిమా( OG movie )తో నెరవేరబోతోంది అని టాక్.ఈ సినిమాలో మొత్తం మూడు టైం లైన్స్ లో కనిపిస్తాడని టాక్ వచ్చింది.పవన్ ను ఫ్యాన్స్ ఎక్కువుగా చూడాలి అనుకుంటున్న ఫుల్ గడ్డం లుక్ కూడా ఉందట.

వకీల్ సాబ్( Vakil Saab ) లో కొద్దీ సమయం ఆ గడ్డం లుక్ లో కనిపించి ట్రీట్ ఇచ్చిన పవన్ ఇప్పుడు ఓజిలో కూడా అదే లుక్ లో కనిపించనున్నాడు.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

మరి సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు