Trivikram : త్రివిక్రమ్ చెప్పిన స్టోరీకి నిద్రపోయిన పవన్ కళ్యాణ్.. కోపంతో త్రివిక్రమ్ ఏం చేశాడంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Power star Pawan kalyan ) డైరెక్టర్ త్రివిక్రమ్ ల మధ్య ఎంత మంచి అనుబంధం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఏ సినిమా ఈవెంట్లో అయినా కూడా త్రివిక్రమ్ కనిపిస్తారు.

 Pawan Kalyan Slept For Trivikram Story-TeluguStop.com
Telugu Athadu, Mahesh Babu, Pawan Kalyan, Tollywood, Trisha, Trivikram, Uday Kir

అలాగే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన చాలా సినిమాలకు త్రివిక్రమ్ ( Trivikram ) మాటలు అందిస్తారు.ఇక త్రివిక్రమ్ సినిమాకి ఓకే చేస్తేనే పవన్ ఆ సినిమాని చేస్తారు.ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఏ పని చేయాలన్నా ముందుగా త్రివిక్రమ్ పర్మిషన్ కావాల్సిందే అనే విధంగా ఉంటుంది వీరిద్దరి మధ్య రిలేషన్.అయితే అలాంటి వీరి బంధంలో ఓ సమయంలో ఒక చిన్న మిస్ అండర్స్టాండింగ్ వచ్చిందట.

ఓసారి పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ సినిమా స్టోరీ చెబితే పవన్ కళ్యాణ్ ఆ కథ వింటూ నిద్రపోయాడట.ఇక ఆ సంఘటన చూసి ఎంతో బాధపడిపోయిన త్రివిక్రమ్ అక్కడినుండి మారుమాట మాట్లాడకుండా బయటికి వచ్చేసి మరో హీరోకి ఆ కథ చెప్పి సూపర్ హిట్ కొట్టాడట.ఇక ఆ సినిమా కథ ఏదో కాదు అతడు మూవీ( Athadu Movie ) .2005లో విడుదలైన అతడు మూవీ లో మహేష్ బాబు త్రిష హీరో హీరోయిన్స్ గా వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

Telugu Athadu, Mahesh Babu, Pawan Kalyan, Tollywood, Trisha, Trivikram, Uday Kir

అయితే ఈ సినిమా థియేటర్లకంటే ఎక్కువగా టీవీలలోనే ఎక్కువ హిట్ అయ్యింది.ఇక ఈ సినిమా ఇప్పుడు వచ్చినా కూడా చాలామంది ప్రేక్షకులు టీవీలకు అతుక్కుని మరీ చూస్తారు.ఫ్యామిలీ లవ్,ఎమోషన్స్, యాక్షన్స్ ప్రతి ఒక్కటి ఈ సినిమాలో ఉండడంతో చాలామంది జనాలు ఈ సినిమాకి కనెక్ట్ అయ్యారు.అయితే ఈ సినిమా కథ ముందుగా పవన్ కళ్యాణ్ (Pawan kalyan) తో చేయాలని త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కి స్టోరీ చెప్పారట.

కానీ కథ వింటూ పవన్ కళ్యాణ్ నిద్రపోవడంతో త్రివిక్రమ్ అక్కడి నుండి వచ్చేసి వేరే సినిమా షూటింగ్లో ఉన్న మహేష్ బాబు( Mahesh Babu )కి ఈ కథ చెప్పారట.

Telugu Athadu, Mahesh Babu, Pawan Kalyan, Tollywood, Trisha, Trivikram, Uday Kir

ఇక కథ నచ్చడంతో మహేష్ బాబు ఓకే చేసి నటించారు.అయితే ఈ సినిమా వీరిద్దరి కంటే ముందే ఉదయ్ కిరణ్ ( Uday Kiran ) తో తెరకెక్కించాలి అనుకొని అడ్వాన్స్ కూడా ఇచ్చారట త్రివిక్రమ్.కానీ ఈ సినిమా చేసే సమయానికి ఉదయ్ కిరణ్ వేరే సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండడం వల్ల తీసుకున్న అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసి సారీ చెప్పారట ఉదయ్ కిరణ్.

అలా ఈ సినిమా ఉదయ్ కిరణ్, పవన్ కళ్యాణ్ లను దాటుకొని మహేష్ బాబు దగ్గరికి వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube