పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయంలో వైసీపీ నేతలు తరచూ విమర్శలు చేస్తుంటారనే సంగతి తెలిసిందే.
అయితే పవన్ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు.
శ్రీకాకుళంను రాజధానిగా ప్రకటిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పవన్ వెల్లడించారు.విశాఖను కొత్తగా డెవలప్ చేయాల్సిన అవసరం ఏముందని పవన్ అభిప్రాయపడ్డారు.
రోజా విమర్శల గురించి పవన్ స్పందిస్తూ పొంతన లేకుండా మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు.వైసీపీ నేతలు పదేపదే తన పెళ్లిళ్ల గురించి మాట్లాడటం ఏమిటని పవన్ ప్రశ్నించారు.
అవసరం అనుకుంటే డివోర్స్ ఇచ్చి వైసీపీ నేతలు సైతం మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చని పవన్ పేర్కొన్నారు.మూడు పెళ్లిళ్లు చేసుకోలేదని వైసీపీ నేతలు జెలసీ ఫీలవుతున్నారని తనకు అనిపిస్తోందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
సమస్యల పరిష్కారం కోసమే జనవాణి అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.నాకు వైవాహిక జీవితం కలిసిరాలేదని ఆ రీజన్ వల్లే నేను మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
జనసేన నేతలు, కార్యకర్తలను అనవసరంగా ప్రభుత్వం అరెస్ట్ చేసిందని వాళ్లు లేకుండా కార్యక్రమంను ఏ విధంగా నిర్వహించడం సాధ్యమవుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు.తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని చెబుతూ నచ్చిన ప్రతి చోట రాజధానిని పెడతారా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.వివేకా హత్య కేసు ఇంకా ఎందుకు పరిష్కరించలేకపోయారని పవన్ అన్నారు.
ఎయిర్ పోర్ట్ దగ్గర పోలీసుల ప్రవర్తన సరిగ్గా లేదని పవన్ కామెంట్లు చేశారు.పోలీసులు నేరస్థులకు కొమ్ము కాస్తూ సమస్యలపై ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కేస్తున్నారని పవన్ అభిప్రాయపడ్డారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో హరిహర వీరమల్లు రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొననున్నారు.ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy