జనసేన పార్టీ( Janasena party ) పదవ ఆవిర్భావ దినోత్సవ సభ కార్యక్రమంలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్( Pawan kalyan ) సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత కులాలకు అతీతంగా ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు.
జనసేన పార్టీకి అండగా ఉంటే.ప్రతిభకు తగ్గ విద్యను అందించడానికి కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఏక్కడికి వెళ్లిన ఇదే తాను గమనించినట్లు.
స్పష్టం చేశారు.
ఎస్సీ, ఎస్టీలకు సంఖ్యాబలం ఉన్న దేహి అనే పరిస్థితి ఏర్పడింది.అందరూ ఐక్యంగా ఉంటేనే.
ఆర్థిక స్వాతంత్రం వస్తుంది.ఏపీలో ఒక కులం పెత్తనం ఆగిపోవాలి.
వైసీపీ ( YCP ) కులాలను విడదీసే ప్రయత్నం చేస్తుంది.అని పవన్ వ్యాఖ్యానించారు.
ఏపీలో యువత కులాల కుంపట్లో నుండి బయటకు వచ్చి విశాలంగా ఆలోచించి.జనసేనకు అండగా ఉండాలని సూచించారు.
రాబోయే తరం మీరే.
కాబట్టి కులాలకు అతీతంగా ఆలోచించి వచ్చే ఎన్నికలలో జనసేనకు మద్దతుగా ఉండాలని పవన్ పేర్కొన్నారు.దాదాపు దశాబ్ద కాలం అది కూడా రెండు చోట్ల ఓడిపోయి పార్టీని ముందుకు నడిపించడం మామూలు విషయం కాదు.అయినా గాని దేశం కోసం పనిచేసిన ఎంతోమంది స్పూర్తి .ఇంతవరకు నన్ను నడిపించాయి అంటూ పవన్ జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ప్రసంగించారు.