తన బలాన్ని గుర్తిస్తున్న పవన్!

ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వ్యాఖ్యల్లో చాలా స్పష్టత కనిపిస్తుంది.ఆయన స్పీచ్ లు వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది.

విలేకరుల సమావేశంలో కూడా ఇరుకున పెట్టే ప్రశ్నలకు నిర్మొహమాటంగా సమాధానం చెబుతున్న పవన్ కళ్యాణ్ శైలి ఆయనకు కొత్త అభిమానులను సంపాదిస్తుందని చెప్పవచ్చు.ఇటీవల పొత్తులపై, సీఎం సీటుపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లుగా వెల్లడించిన పవన్ వ్యవహార శైలి జనసేనలో కొంతమంది హార్డ్ కోర్ అభిమానులను నిరాశపరచినప్పటికీ న్యూట్రల్ ఓటర్లను, సాధారణ జనాన్ని మెప్పించిందని వార్తలు వస్తున్నాయి.

తమ బలాన్ని బహిరంగంగా చెప్పుకొని బలహీనతలను పార్టీ అంతర్గత సమావేశాలలో మాత్రమే ఒప్పుకునే సాధారణ రాజకీయ పార్టీలకు భిన్నంగా తన బలాన్ని బలహీనతలను కూడా బహిరంగంగా ఒప్పుకుంటూ తాను ఒక నిర్మాణాత్మక రాజకీయవేత్తగా ప్రయాణం చేస్తున్నానని అధికారం కోసం అడ్డదారులు తొక్కనని, తన కష్టం పలిస్తే అదే తన దగ్గరకు వస్తుందన్న వ్యాఖ్యలు తానెంత పరిమితి చెందిన నాయకుడిగా తయారయ్యాడో స్పష్టం చేస్తుంది.

ఒక పార్టీ అధినేత మరొక పార్టీ అధినేతను ముఖ్యమంత్రి ( Chief Minister ) చేయడానికి ఒప్పుకుంటారా? మీరు అయితే అలా చేస్తారా అంటూ మీడియా ముఖంగా తన పార్టీ నేతలను ప్రశ్నించిన విధానం చూస్తే సాధారణ రాజకీయ నాయకులకు భిన్నంగా ఆయన ఆలోచన చేస్తున్నారని చెప్పవచ్చు.తమ బలం ఉన్న చోట్లను గుర్తిస్తున్నామని, తమ బలం ఖచ్చితంగా పెరిగిందని,, పార్టీ బలంగా ఉన్నచోట్ల మెజారిటీ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించడం ద్వారా పవన్ గ్రౌండ్ రియాలిటీని గుర్తించారని ఇది కచ్చితంగా భవిష్యత్తులో జనసేనకు మేలు చేస్తుందని భావించవచ్చు.

Advertisement

పొత్తులపై ఆందోళన పడుతున్న తెలుగుదేశం శ్రేణులకు కూడా పవన్ ప్రకటన చాలా ఆనందం కలిగించింది అని చెప్పవచ్చు గౌరవప్రదమైన సీట్లు మాత్రమే అడుగుతానని , తన బలం నిరూపించుకున్న తర్వాతే సీఎం సీటు( CM Seat ) గురించి ఆలోచిస్తానని చెప్పిన విధానం ద్వారా పొత్తు లో తానెంత నిజాయితీగా ఉన్నానన్న విషయాన్ని బహిరంగంగా నిరూపించినట్లయ్యింది దీంతో ఆయన తెలుగు తమ్ముళ్ల అభిమానాన్ని కూడా చురగోన్నారన్న విషయం వారి సోషల్ మీడియా పోస్టుల ద్వారా అర్థమవుతుంది.

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!
Advertisement

తాజా వార్తలు