పవన్‌ వల్ల ఆ ట్యాలెంటెడ్‌ డైరెక్టర్స్ బ్లాక్‌... గతంలో మాదిరిగానే ఇప్పుడు

పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తూ మరో వైపు సినిమాల్లో కూడా చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈయన హీరోగా నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.

ఆ సినిమా ఎప్పటికి విడుదల అవుతుంది అనే విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.మరో వైపు ఈయన వినోదయ్య సిత్తం అనే తమిళ సినిమా రీమేక్ కు రెడీ అయ్యాడు.

భారీ అంచనాల నడుమ రూపొందిన వినోదయ్య సిత్తం సినిమాకు సంబంధించిన రీమేక్ రైట్స్ ను దక్కించుకున్న వారు పవన్ మరియు సాయి ధరమ్ తేజ్ తో రీమేక్‌ చేసేందుకు సిద్దం అయ్యారు.తెలుగు లో రీమేక్ కు సంబంధించిన బాధ్యతలను కూడా దర్శకుడు సముద్రకని చూసుకుంటున్నాడు.

త్రివిక్రమ్‌ మరియు సాయి మాధవ్ బుర్ర రచన సహకారంతో ఈ సినిమా రూపొందుతోంది.మరో వైపు పవన్‌ కళ్యాణ్ తదుపరి సినిమాలకు సంబంధించి విషయాలు ఆసక్తికరంగా మారాయి.

Advertisement

ఎప్పుడెప్పుడు పవన్‌ తో సినిమా చేద్దామా అంటూ ఎదురు చూస్తున్న వారు పవన్‌ వారికి ఓకే చెప్పడంతో స్క్రిప్ట్‌ పట్టుకుని రెడీగా ఉన్నారు.కాని ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే పవన్ కళ్యాణ్ తో సినిమాలు అనుకున్న హరీష్ శంకర్‌ తో పాటు మరో ఇద్దరు ముగ్గురు యంగ్‌ అండ్ ట్యాలెంటెడ్‌ దర్శకులు ఏడాది నుండి మూడు సంవత్సరాల పాటు వృదా చేసుకున్నట్లుగానే మారింది.

గతంలో సంపత్‌ నంది దర్శకత్వంలో ఒక సినిమాను చేయాలనుకున్నాడు.ఆ సినిమా కోసం దాదాపుగా రెండు మూడు సంవత్సరాలు సంపత్‌ నంది వెయిట్‌ చేశాడు.కాని సినిమా వర్కౌట్‌ కాలేదు.

అసలు పవన్‌ నుండి సంపత్‌ నందికి అవకాశం రాలేదు.అలాగే పవన్‌ నుండి మళ్లీ నిరాశే అంటూ పలువురు యంగ్‌ దర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంలో యంగ్‌ దర్శకులు పవన్ పై ఒకింత అసహనంతో ఉన్నారు.

అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?
Advertisement