గేమ్ ఛేంజర్ ఈవెంట్... అల్లు అర్జున్ కి కౌంటర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) నటించిన గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి ఒక సినిమా వేడుకలో పాల్గొనడంతో ఈ వేదికపై ఈయన ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నారనే అంశంపై ఆసక్తి నెలకొంది.

అయితే ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పరోక్షంగా అల్లు అర్జున్ పై( Allu Arjun ) కూడా సెటైర్లు వేశారని స్పష్టమవుతుంది.ముఖ్యంగా సినిమా టికెట్ల రేట్ల గురించి ఈయన మాట్లాడుతూ అల్లు అర్జున్ కి కౌంటర్ ఇచ్చారు.

ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమాకు ఏపీలో భారీ స్థాయిలో టికెట్ల రేట్లు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.బెనిఫిట్ షోలకు అనుమతి తెలుపుతూనే మరోవైపు సినిమా టికెట్ల రేట్లు కూడా పెంచారు.ఇలా సినిమా టికెట్ల రేట్లు పెంచడం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లు పెంచకపోతే బ్లాక్ లో టికెట్ కొనుగోలు చేసి సినిమా చూస్తారు.

అలా చేయటం వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు.అందుకే సినిమా టికెట్ల రేట్లు పెంచడం వల్ల జీఎస్టీ రూపంలో తిరిగి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అందుకే సినిమా టికెట్ల రేట్లు పెంచుతున్నారని తెలియజేశారు.

Advertisement

ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీపై ఏ విధమైనటువంటి పక్షపాతం లేదు.గతంలో కొంతమంది హీరోలు కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపలేదు.అయినప్పటికీ కూడా మేము వారి సినిమాలకు టికెట్ల రేట్లు పెంచాము.

ఇక సినిమా ఇండస్ట్రీలో నేను కానీ చరణ్ కానీ నేడు ఈ స్థాయిలో ఉన్నాము అంటే అందుకు కారణం చిరంజీవి గారే.మనం ఎంత ఎత్తుకు ఎదిగిన మన మూలాలను మర్చిపోకూడదు.

మా మూలం చిరంజీవి గారే అంటూ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అల్లు అర్జున్( Allu Arjun ) ఉద్దేశించి ఈ కామెంట్లు చేశారనీ స్పష్టమవుతుంది.సినిమా ఇండస్ట్రీ మొత్తం కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపినప్పటికి అల్లు అర్జున్ మాత్రమే వైకాపా పార్టీకి మద్దతు తెలుపుతూ నంద్యాల వెళ్లిన విషయం మనకు తెలిసిందే.

అప్పటినుంచి మెగా అల్లు కుటుంబం మధ్య దూరం పెరిగింది కానీ ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో ఈ రెండు కుటుంబాల మధ్య దూరం తగ్గిందని చెప్పాలి.

చరణ్ కియరా జోడికి కలసి రాలేదా...అప్పుడు అలా... ఇప్పుడు ఇలా?
Advertisement

తాజా వార్తలు