పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ఎప్పటి నుండో అటు సినిమాలు ఇటు రాజకీయాలను మ్యానేజ్ చేస్తూ వస్తున్నాడు.
మరి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లైనప్ లో వరుసగా క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.
ఈయన లైనప్ ఎంత ఇంట్రెస్టింగ్ గా సాగుతున్నప్పటికీ మరోసారి పవర్ స్టార్ రాజకీయాలలో బిజీ కాబోతున్నాడు.జూన్ 14 నుండి తన వారాహి యాత్రని స్టార్ట్ చేయనున్నట్టుగా పవన్ తరుపు నుండి ఇప్పటికే క్లారిటీ వచ్చింది.
అంటే రేపటి నుండి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర స్టార్ట్( Pawan Kalyan Varahi Yatra Start ) కాబోతుంది.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఆయన సినిమా నిర్మాతలు తన యాగంలో భాగం కావడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.
వీరి పూర్తి సపోర్ట్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.ఇక ఈయన యాత్రకు సపోర్ట్ చేయడమే కాకుండా ఆయన యాత్ర కారణంగా ఎక్కడికి వెళితే అక్కడ సినిమా షూటింగ్ కూడా జరిగేలా ప్లాన్ చేస్తున్నారట.
పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తున్నప్పటికీ షూటింగ్స్ ఆపకూడదు అని అనుకుంటున్నాడట.మరి ఇందుకు నిర్మాతలు కూడా ఓకే చెప్పారని తెలుస్తుంది.ముఖ్యంగా పవన్ చేస్తున్న ఓజి సినిమా నిర్మాత, ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాత షూటింగ్స్ పవన్ ఎక్కడ ఉంటే అక్కడ షూటింగ్స్( Wherever Pawan is the shooting is also there ) ఏర్పాటు చేయనున్నారట.
పవన్ వెసులుబాటు ను బట్టి పవన్ ఉండే రోజులతో అక్కడ సెట్ వర్క్స్ చేసి షూటింగ్స్ చేయాలని డిసైడ్ అయ్యారట.
ఇందుకు పవన్ తో పాటు షూటింగ్స్ కూడా కదలనున్నాయి.ప్రజెంట్ పవన్ కళ్యాణ్ ఎక్కువుగా మంగళగిరి ప్రాంతాల్లోనే యాత్ర సాగనుంది కాబట్టి ఆ చుట్టుపక్కల షూట్ ఏర్పాటు చేసేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.వారి ఇదంతా కాస్త హడావిడిగా సాగుతుంది కాబట్టి షూటింగ్స్ కూడా అంతే హడావిడిగా ముగిస్తారా లేదా ఈ ఐడియా ఎంత వరకు వర్కౌట్ అవుతుందో అనేది చూడాలి.
మొత్తానికి పవన్ కోసం నిర్మాతలు చాలానే కష్టపడనున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy