పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) లైనప్ లో వరుసగా క్రేజీ ప్రాజెక్టులు ఉన్న విషయం తెలిసిందే.వాటిల్లో ‘ఓజి’( OG ) కూడా ఒకటి.
ఈ సినిమా షూట్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది.అలా ప్రకటించిన కొద్దీ రోజులకే షూట్ స్టార్ట్ చేసి పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ సర్ప్రైజ్ ఇచ్చాడు.
ముంబైలో స్టార్ట్ అయిన ఈ షూట్ ఆ తర్వాత పూణేలో కొద్దీ రోజులు జరుపుకుంది.ఇక అక్కడ కూడా ముగించి హైదరాబాద్ చేరుకున్నారు.
ఇటీవలే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసి టాకీ పార్ట్ మొత్తం శరవేగంగా పూర్తి చేస్తున్నారు.యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు రావడంతో ఈ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెంచేసు కుంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.

ఇదిలా ఉండగా పవన్ సినిమాలతో పాటు రాజకీయాలలో కూడా పాల్గొంటాడు అనే విషయం తెలిసిందే.మరి ప్రజెంట్ అయితే ఓజి సినిమా షూట్ లోనే బిజీగా ఉన్నాడు.అయితే త్వరలోనే పవన్ కళ్యాణ్ పొలిటికల్ పరంగా బిజీ కానున్నాడు.
జూన్ 14 నుండి తన వారాహి యాత్రని స్టార్ట్ ( Varahi Yatra )చేయనున్నట్టుగా నిన్ననే కన్ఫర్మ్ అయ్యింది.ఈ లోపులోనే మిగిలిన డేట్స్ మొత్తం ఓజి సినిమాకు కేటాయించినట్టు తెలుస్తుంది.

అందుకే పవన్ వారాహి యాత్ర స్టార్ట్ అయ్యే వరకు పవన్ ఓజి షూట్ లోనే ఉండనున్నారని ఆ వెంటనే వారాహి యాత్రలో బిజీగా మారనున్నారని తెలుస్తుంది.ఇదిలా ఉండగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే థమన్ సంగీతం అందిస్తుండగా.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.







