పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం పూర్తిగా రాజకీయాలకే అంకితమై ఉన్నారు.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో జనసేన పార్టీని ఎలాగైనా గెలిపించాలనే ఉద్దేశంతో ఎన్నికలపైనే పూర్తి దృష్టి సారించారు.
ఇక ఈయన హీరోగా రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagath Singh), హరిహర వీరమల్లు, ఓజి వంటి సినిమాలు కూడా ఆగిపోయాయి.అయితే ఈయన రాజకీయాల లో రాణిస్తున్నారు.
ఇక అధికార పార్టీపై విమర్శలు చేసిన ప్రతిసారి అధికార పార్టీకి పవన్ కళ్యాణ్ నీ విమర్శించడానికి కారణాలు లేకపోవడంతో ఆయన మూడు పెళ్లిల ప్రస్తావన తీసుకువస్తూ ఉంటారు.ఇకవాళ్లు మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకువచ్చిన ప్రతీసారి పవన్ కూడా గట్టిగానే బుద్ధి చెబుతారు.
అయితే ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన మూడో భార్య రష్యన్ నటి అయిన అన్నా లెజ్నోవా (Anna lezhneva) తో కలిసి ఉంటున్నారు.ఇక రెండో భార్య కూడా హీరోయిన్ రేణు దేశాయ్.
ఆమెకు విడాకులు ఇచ్చి మూడవ పెళ్లి చేసుకున్నారు.అయితే వీరిద్దరూ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లే అయినప్పటికీ మొదటి భార్య నందిని సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం పరిచయం లేని అమ్మాయి.
ఇక పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు వైజాగ్ లో నందినితో పరిచయం ఏర్పడి ఇంట్లో వాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.

ఇక వీరి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది.అయితే నందిని (Nandini) గురించి చాలామందికి తెలియదు.కానీ తాజాగా నెట్టింట్లో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.
అదేంటంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ వైఫ్ నందిని అక్కినేని నాగేశ్వరరావు కి దూరపు బంధువు అని తెలుస్తోంది.నందిని తాత అలాగే అక్కినేని నాగేశ్వరరావు తండ్రికి మధ్య చుట్టరికం ఉందట.
వీరిద్దరూ దూరపు బంధువులని తెలుస్తోంది.అయితే నందిని నాగార్జున కి( Nagarjuna ) వరుసకు మరదలు అవుతుందట.

సినిమా ఇండస్ట్రీకి ఏ మాత్రం సంబంధం లేని నందిని కి అక్కినేని ఫ్యామిలీతో సంబంధం ఉందనే విషయం చాలామందికి తెలియదు.ఇక వీరి పెళ్లి జరిగిన సమయంలో కూడా అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి మరీ ఈ విషయం చెప్పారట.కానీ వీళ్ళు విడాకులు తీసుకున్న సమయంలో అక్కినేని నాగేశ్వరరావు ఎంత సర్రి చెప్పినా కూడా ఇద్దరూ వినలేదని తెలుస్తోంది.