పవన్ చెప్పిన 'ఉప్మా ' స్టోరీ టీడీపీకేనా ? 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ( Varahi yatra )వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.

ముఖ్యంగా పవన్ ప్రసంగాలు , ఆయన చేస్తున్న విమర్శలు అధికార పార్టీ వైసీపీకి ఇబ్బందికరంగా మారాయి.

ఇక సొంత పార్టీ నాయకులు అయోమయానికి గురయ్యే విధంగా పవన్ మాట్లాడుతుండడం చర్చనీయాంసంగా మారింది.వారాహి యాత్ర ప్రారంభం కాకముందు సీఎం పదవిపై తనకు ఆశ లేదని , అంత అర్హత, బలం తనకు లేదు అని,  దానికి చాలా అనుభవం కావాలి అంటూ మాట్లాడిన పవన్, ఈ యాత్రలో మాత్రం తనను ముఖ్యమంత్రిగా గెలిపించాలని, ఒక్క ఛాన్స్ జనసేనకు ఇవ్వాలని ప్రజలను పదే కోరుతున్నారు.

దీంతో జనసేనతో పొత్తు ప్రయత్నాల్లో ఉన్న టిడిపికి పవన్ ప్రసంగాలు షాక్ ఇస్తున్నాయి.దీంతో కొంతమంది టీడీపీ కీలక నేతలు పవన్ ను( Pawan kalyan ) టార్గెట్ చేసుకుని టీవీ డిబేట్ లలోనూ, బహిరంగంగాను విమర్శ చేస్తున్నారు.

Pawan Kalyan Comments On Tdp Party In Varahi Yatra , Janasena, Pawan Kalyan,

 తన పర్యటనకు వస్తున్న జనాదరణ చుసి పవన్ సీఎం పదవి విషయంలో మాట మార్చారని టిడిపి( TDP ) అనుమానిస్తోంది తాజాగా ముమ్మిడివరం లో వైసీపీ ను టార్గెట్ చేసుకుని పవన్ విమర్శలు చేశారు ఇది 70 : 30 సర్కారు అంటూ విమర్శించారు.వంద మంది ప్రజలు 70 మంది కష్టపడి సంపాదించిన సొమ్మును వైసిపి ప్రభుత్వం తనకు కావలసిన 30 మందికి పంచుతూ ఓటు బ్యాంకును పెంచుకుంటుంది అని, కేవలం రాజకీయం కోసం మాత్రమే ప్రభుత్వ పథకాలను వాడుకుంటుందని పవన్ మండిపడ్డారు.ఈ సందర్భంగా పవన్ ఓ ఉప్మా స్టోరీని చెప్పారు.

Advertisement
Pawan Kalyan Comments On Tdp Party In Varahi Yatra , Janasena, Pawan Kalyan,

ఓ వసతి గృహంలో రోజువారి ఉప్మా పెడుతుంటే అంతా ఎదురు తిరగారని, మాకు ఉప్మా వద్దని నిరసన వ్యక్తం చేశారని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరికి ఏం కావాలో ఓటింగ్ పెట్టారని, 18 మంది యధావిధిగా ఉప్మా కావాలని కోరుకోగ్ మిగిలిన 82 మంది వివిధ రకాల టిఫిన్లు పేరు చెప్పారని, కానీ ఉప్మా కోరుకున్న వారి సంఖ్య అన్నిటికంటే ఎక్కువగా ఉండడంతో మళ్లీ ఉప్మా దిక్కు అయిందని పవన్  స్టోరీ చెప్పారు.

Pawan Kalyan Comments On Tdp Party In Varahi Yatra , Janasena, Pawan Kalyan,

వైసిపి కూడా ఉప్మా తరహా పార్టీని అని వైసిపి వద్దు అనుకుంటున్న వారిలో ఐక్యత అవసరమని పరోక్షంగా తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు.విపక్ష పార్టీల్లో అనైక్యత ఉండడం వల్లే వైసీపీకి బలంగా మారిందని, ఆ అనైక్యతను వీడి ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తే కచ్చితంగా వైసీపీ ఓటమి ఖాయమని పవన్ అన్నారు.ఇప్పటికైనా జనసేనతో కలిసి రావాలని పరోక్షంగా టిడిపికి పవన్ చురకలు అంటించారు.

Advertisement

తాజా వార్తలు