ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మెగా డాటర్ నిహారిక( Niharika ) ను అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇటీవల ఏపీలోని విజయవాడ వరదల( Floods ) లో చిక్కుకున్న సంగతి మనకు తెలిసిందే ఇలా పెద్ద ఎత్తున వరదలు రావడంతో ఆ ప్రాంత ప్రజలకు కనీస అవసరాలను తీర్చడం కోసం పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలందరూ విరాళాలు ప్రకటించారు.
ఇక మెగా కుటుంబం నుంచి సుమారు 10 కోట్ల రూపాయల వరకు సాయం అందింది.
ఇక మెగా డాటర్ నిహారిక కూడా ఇండస్ట్రీలో నటిగా నిర్మాతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆమె బుడిమేరు వరద ముప్పుకు గురైన 10 గ్రామాలకు గ్రామానికి 50,000 చొప్పున 5 లక్షల రూపాయలు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి విరాళం అందించారు.అయితే తాజాగా పవన్ కళ్యాణ్ వరద బాధితుల కోసం సాయం అందించిన ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.
ఇక నిహారికను కూడా ఈయన ప్రశంసిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి ఒక్కొక్క గ్రామానికి 50 వేల రూపాయల చొప్పున 10 గ్రామాలకు రూ.5 లక్షల విరాళం ప్రకటించిన అన్నయ్య నాగబాబు(Nagababu ) కుమార్తె నిహారికకు అభినందనలు.కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలనే మంచి సంకల్పంతో సాయం చేసేందుకు ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
ఇటీవల నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక జీవితంలో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy