''ఉస్తాద్'' కోసం పవన్ కళ్యాణ్ అన్ని డేట్స్ కేటాయించాడా?

Pawan Kalyan Allots Bulk Dates For Ustaad Bhagat Singh, Ustaad Bhagat Singh, Harish Shankar, Pawan Kalyan,Sai Dharam Tej,Samuthirakani

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) మళ్ళీ సినిమా షూటింగులలో వేగం పెంచేసాడు.ఇటీవలే ఒక రీమేక్ సినిమా షూట్ ను పవన్ ముగించాడు.

 Pawan Kalyan Allots Bulk Dates For Ustaad Bhagat Singh, Ustaad Bhagat Singh, Har-TeluguStop.com

కేవలం 22 రోజుల డేట్స్ మాత్రమే ఈ సినిమాకు కేటాయించడంతో శరవేగంగా షూటింగ్ జరిగింది.కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘వినోదయ సీతం రీమేక్ లో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ), పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్నారు.

సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఇచ్చిన 22 రోజుల డేట్స్ ను సరిగ్గా వాడుకుని షూట్ మొన్నటితో పూర్తి చేసారు.ఇక ఈ సినిమా జులై 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.

ఇదిలా ఉండగా 2024 ఎన్నికల ప్రచారం కోసం పవన్ సిద్ధం కావాల్సి ఉండగా ఈ లోపులోనే వీలైనన్ని సినిమాల షూటింగులు పూర్తి చేయాలని చూస్తున్నాడు.

అందుకే ఈ రీమేక్ సినిమా షూట్ పూర్తి కాగానే వెంటనే మరో సినిమా షూటింగ్ తో బిజీ కాబోతున్నట్టు తెలుస్తుంది.మరి పవన్ లైనప్ లో ఉన్న సినిమాల్లో హరీష్ శంకర్ ( Harish Shankar ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ”ఉస్తాద్ భగత్ సింగ్” ( Ustaad Bhagat Singh ) ఒకటి.గబ్బర్ సింగ్ అనే సూపర్ హిట్ కాంబోను మరోసారి రిపీట్ చేస్తుండడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

మరి అతి త్వరలోనే ఈ సినిమా షూట్ స్టార్ట్ కాబోతుందట.

ఇటీవలే పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ బల్క్ డేట్స్ కేటాయించినట్టు టాక్.అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ కోసం పవర్ స్టార్ 90 రోజుల డేట్స్ ను కేటాయించారట.మరి ఈసారి కూడా హరీష్ శంకర్ పవన్ కు గబ్బర్ సింగ్ లాంటి హిట్ అందిస్తాడో లేదో వేచి చూడాలి.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.అలాగే పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది అని వార్తలు వస్తుండగా.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Pawan Kalyan Allots Bulk Dates For Ustaad Bhagat Singh, Ustaad Bhagat Singh, Harish Shankar, Pawan Kalyan - Telugu Harish Shankar, Pawan Kalyan, Pawankalyan, Ustaadbhagat #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube