టీడీపీ – జనసేన పొత్తు( TDP-Janasena) సీట్లపై కాపు సంక్షేమ సంఘం నేత, మాజీ మంత్రి హరిరామ జోగయ్య( Harirama Jogaiah ) మరో లేఖ రాశారు.బడుగు, బలహీన వర్గాల భవిష్యత్ ఏంటో తాడేపల్లిగూడెం సభలో తేల్చాల్సిందేనని పేర్కొన్నారు.
కాపులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలన్నారు.పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలని కాపులు భావిస్తున్నారని తెలిపారు.

పవన్ కు గౌరవ హోదా పదవి ఇవ్వకుంటే ఈనెల 29న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు.పవర్ షేరింగ్ లో పవన్ కల్యాణ్ – చంద్రబాబు( Pawan Kalyan-Chandrababu ) పాత్ర స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.







