Amitabh Bachchan Parveen Babi: అమితాబ్ బచ్చన్ నన్ను కిడ్నాప్ చేసి మాఫియా కు ఇవ్వాలనుకున్నాడు : పర్వీన్

ఎవరు అవునన్నా కాదన్నా కొన్నేళ్ల క్రితం వెనక్కి వెళితే బాలీవుడ్ కి, మాఫియా కి విడదీయలేని అనుబంధం ఉండేది.

బాలీవుడ్ నుంచి అనేక మంది హీరోయిన్స్ ని మాఫియా పెంచి పోషించేది.

అలాగే స్టార్ హీరో లు సైతం మాఫియా కనుసన్నల్లోనే పని చేసేవారు.అందుకు అనేక ఉదాహరణలు కూడా మన ముందే ఉన్నాయి.

చాలామంది హీరోలు వీకెండ్ వచ్చిందంటే చాలు ఏదో ఒక మాఫియా తో( Mafia ) మీటింగ్లోనే ఉండేవారు.వారు చెప్పినట్టు వినకపోతే హీరోలకు భవిష్యత్తు ఉండదు, హీరోయిన్స్ కి అవకాశాలు రావు అనే బెదిరింపులు ఎక్కువగా ఉండేవి.

ఎందుకు వచ్చిన గోల అన్నట్టుగా బాలీవుడ్ స్టార్స్( Bollywood Stars ) అంతా కూడా మాఫియా కి గులాం చేశారు.కొన్నేళ్ల పాటు చాలామంది ఇందులో బాధితులు గానే ఉన్నారు.

Advertisement

అయితే షాకింగ్ విషయం ఏమిటంటే ఇందుకు ఎలాంటి స్టార్ హీరోలు సైతం అతీతం కాదు.

ఒకానొక సమయంలో అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan ) సైతం మాఫియాతో అండర్ వరల్డ్ డాన్స్ తో సంబంధాలు కలిగి ఉన్నాడు అనేది నటి పర్వీన్ బాబి( Parveen Babi ) చెప్పే వరకు ఎవరికీ తెలీదు. అమితాబ్ ఒక అండర్ వరల్డ్ డాన్ అని, అతడు తనని కిడ్నాప్ చేయాలని చూశాడని పర్వీన్ బాబి సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చింది.అలా బాలీవుడ్( Bollywood ) కన్నా మాఫియా ప్రభావం ఎక్కువగా ఉండేదని అలాగే అమితాబ్ ఒకానొక సమయంలో తనను కిడ్నాప్ చేసి మాఫియాకి అప్పగించాలనే చూశాడని, పర్వీన్ బాబి చెప్పడంతో మీడియా అంతా కూడా ఈ విషయంపై ఫోకస్ చేసింది.

మీడియాలోనే కాదు బాలీవుడ్ లో కూడా ఈ వార్త ప్రకంపనలు సృష్టించింది.బాలీవుడ్ తో మాఫియాకు ఉన్న సంబంధాల గురించి వార్తలు జోరందుకున్నాయి.

ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది ఎవరు చెప్పకపోయినా ఈ విషయం కొన్నేళ్లపాటు మీడియాలో నానింది.ఆ తర్వాత ఈ రూమర్స్ జోరు ఎక్కువ అవుతున్న సందర్భంలో అమితాబ్ జయబాధూరిని( Jayabaduri ) వివాహం చేసుకొని ఫ్యామిలీ లైఫ్ సెటిల్ చేసుకున్నాడు. కానీ అమితాబ్ లాంటి ఒక మెగాస్టార్ ఒక హీరోయిన్ ని కిడ్నాప్ చేయడం అనే వార్త మాత్రం చిన్న విషయం ఏమి కాదు.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?

కొన్నాళ్ల తర్వాత ఆ వార్త మరుగున పడిపోయింది.దానిమీద ఎలాంటి ఎంక్వయిరీ కానీ ఎలాంటి పోలీస్ కేసు కానీ నమోదు కాలేదు.ఆ తర్వాత కొన్నాళ్లకు పర్వీన్ కి మతిస్థిమితం లేదు అనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి.

Advertisement

ఆ తర్వాత ఆమె తన ఫ్లాట్ లోనే చనిపోయిన సంగతి మనందరికీ తెలుసు.

తాజా వార్తలు