Dasara : దసరా సినిమాపై పరుచూరి గోపాల కృష్ణ రివ్యూ ఇదే.. సినిమా అలా ఉందంటూ?

శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) దర్శకత్వంలో నాని కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం దసరా( Dasara ).

ఇటీవలె విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాతో మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు నాని.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ( Paruchuri Gopala Krishna ) స్పందించారు.

ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఆశ్చర్యపరిచేలా కనిపించారు నాని.

మాములుగా నాని ఆయన్ని మనం క్యూట్‌ లుక్‌లో చూస్తాము.

Advertisement

అలాంటిది నాని( Natural Star Nani ) ఈ సినిమాలో మాస్‌ లుక్‌లో, మద్యానికి బానిసైన యువకుడిగా కనిపించాడు.తన పెర్ఫార్మెన్స్‌ నభూతో నభవిష్యతి! అన్నట్టుగా ఉంది.అందుకే ఈ సినిమా విషయంలో ముందు నానినే మెచ్చుకోవాలి.

అలాగే హీరో మిత్రుడిగా దీక్షిత్‌ శెట్టి అదరగొట్టేశారు.ఇది పూర్తిగా నాని,కీర్తి సురేష్( Keerthy Suresh ) సినిమా.

ఇందులో అంతర్లీనంగా రామాయణం,మహాభారతం కథలు నడిచాయి.విలన్‌ ఒక రావణాసురుడి లాంటి వాడు.

అందుకే అతడిని చంపేటప్పుడు రావణకాష్ఠాన్ని చూపించారు.సాయికుమార్‌ పాత్ర చిన్నదే అయినప్పటికీ చక్కగా తీర్చిదిద్దారు.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности
వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!

క్లైమాక్స్‌లో అతడు చెప్పే డైలాగ్‌ విని ఇతడే విలనా? అనే సందేహం కూడా ప్రేక్షకులకు వస్తుంది.అలాంటి ఎలిమెంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ను దర్శకుడు క్రియేట్‌ చేశాడు.అలాగే ఇందులో సూరి చనిపోయిన తర్వాత వెన్నెలను వితంతువును చేస్తుంటే ధరణి అక్కడికి వెళ్లి అదే తాళిని ఆమె మెడలో కడతాడు.

Advertisement

ఇదొక అద్భుతమైన షాట్‌.పాత రోజుల్లో దర్శకులు చేయలేని సాహసం ఇప్పుడున్న వాళ్లు చేస్తున్నారనడానికి నిదర్శనం ఆ షాట్‌ అని చెప్పవచ్చు అని తెలిపారు పరుచూరి.

అలాగే విలన్‌ చనిపోయాక కూడా సినిమా మరికొంత సేపు రన్‌ అవుతుంది.ధరణి( Dharani ) ప్రేమను వెన్నెల అంగీకరించిందా? అనే ఆసక్తిని అక్కడ దర్శకుడు క్రియేట్‌ చేశాడు.అలా చివరి షాట్స్‌లో ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా థియేటర్‌ నుంచి బయటకు వచ్చేలా దర్శకుడు దీన్ని తెరకెక్కించారు.

నాని జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇది అని చెప్పుకొచ్చారు పరుచూరి గోపాలకృష్ణ.