పరివర్తిని ఏకాదశి రోజు.. ఈ పనులను అస్సలు చేయకండి..!

ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి సంవత్సరంలో ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి.ఇలా సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి.

ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకమైన పేరు ప్రాముఖ్యత కచ్చితంగా ఉంటుంది.అలాగే భాద్రపద మాసంలోనీ శుక్లపక్ష ఏకాదశి అంటే ఈ రోజు వచ్చిన ఏకాదశిని పరివర్తిని ఏకాదశి( Parivartini Ekadashi ) అని అంటారు.

ఈ ఏకాదశి ఉదయం ఏడు గంటల 57 నిమిషములకు మొదలై రేపు ఉదయం 5 గంటల 2 నిమిషములకు ముగుస్తుంది.పరివర్తిని ఏకాదశి రోజున ఎవరైతే విష్ణును భక్తిశ్రద్ధలతో పూజిస్తారో వారికి ఎంతో పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చేసిన లేక తెలిసో తెలియకో చేసిన పాపాలు కూడా పరివర్తిని ఏకాదశి రోజున విష్ణు పూజతో దూరం అవుతాయని చెబుతున్నారు.

Advertisement

ఈ ఏకాదశి రోజు ఉపవాసం( fasting ) ఉండి పూజ చేయడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్య ఫలితం లభిస్తుంది.ఇంకా చెప్పాలంటే పరివర్తిని ఏకాదశి రోజున కొన్ని పనులు చేస్తే మాత్రం విష్ణువుకు కోపం వస్తుందని పండితులు చెబుతున్నారు.అయితే ఈ రోజు చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పరివర్తిని ఏకాదశి రోజున ఇంటి ముందుకు వచ్చిన బిచ్చగాడి అయినా సరే ఒట్టి చేతులతో పంపకూడదు.పరివర్తిని ఏకాదశి రోజున మద్యం, మాంసం వంటివి తీసుకోకూడదు.ఒకవేళ అటువంటివి ఈ రోజు చేస్తే అత్యంత దురదృష్టమని చెబుతున్నారు.

పరివర్తిని ఏకాదశి రోజున గోళ్లు, వెంట్రుకలు, కత్తిరించకూడదు.అలాగే షేవింగ్ చేయించుకోకూడదు.పరివర్తిని ఏకాదశి రోజున ఎవరికి హాని చేయకుండా ఉండాలి.

ఇంకా చెప్పాలంటే భగవంతుణ్ణి స్తుతిస్తూ మనసును పూర్తిగా విష్ణుమూర్తి( Lord vishnu ) పై లగ్నం చేసి ఆయనను కీర్తించాలి.పరివర్తిని ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులు ధరించాలి.

వైరల్ : కొడుకు కోసం ఆ తండ్రి బిర్యానీతో పడిన కష్టం.. ఎమోషనల్ స్టోరీ..
బ‌ల‌హీన‌మైన కురుల‌కు బ‌లానిచ్చే బెస్ట్ ఆయిల్ ఇదే..త‌ప్ప‌కుండా తెలుసుకోండి!

దానధర్మాలు చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.ఉపవాస దీక్షను ఆచరించి అత్యంత శ్రద్ధతో విష్ణుమూర్తిని పూజించడం వల్ల లక్ష్మీదేవి( Lakshmi devi ) కరుణిస్తుంది.

Advertisement

ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడడానికి ఇది మంచి అవకాశం అని పండితులు చెబుతున్నారు.

తాజా వార్తలు