Pallavi prashanth : ఆమె నా చెల్లి.. బర్రెలక్కతో వివాహం పై ఎమోషనల్ కామెంట్స్ చేసిన ప్రశాంత్!

సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలలో మారిన సంగతి మనకు తెలిసిందే ఇలా సోషల్ మీడియా ద్వారా మంచి పాపులర్ సొంతం చేసుకున్నటువంటి వారిలో బర్రెలక్క ( Barrelakka ) అలియాస్ శిరీష ( Shirisha ) ఒకరు.

అలాగే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్( Pallavi prashanth ) పేరు కూడా ఇటీవల కాలంలో భారీ స్థాయిలో మారుమోగిపోతుంది.

వీరిద్దరు కూడా వారి జీవనశైలికి సంబంధించినటువంటి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.ఈ విధంగా బర్రెలక్క గత తెలంగాణ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికలలో నిలిచి పోటీ చేసిన సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈమెకి అనుకున్న స్థాయిలో మెజారిటీ రాక ఓడిపోయింది అయితే మాత్రం ఒక సెలబ్రిటీగా పాపులర్ అయిన సంగతి మనకు తెలిసిందే.ఈమె ఎన్నికలలో పోటీ చేస్తున్నారనే విషయం తెలియడంతో అందరి అటెన్షన్ ఈమె పైన పడింది.

ఇక ఇలా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి పాపులర్ చేసుకున్నటువంటి వారిలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా ఒకరు.

Advertisement

పల్లవి ప్రశాంత్ కూడా రైతులు పడే ఇబ్బందులను కష్టాలను వీడియోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసేవారు అంతేకాకుండా ఈ పాపులారిటీతో ఈయనకు బిగ్ బాస్( Bigg Boss ) అవకాశం కూడా వచ్చింది బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగే సమయంలో చాలామంది ఈయనకు మద్దతుగా నిలవడంతో కప్ అందుకొని బయటకు వచ్చారు.ఇలా బయటకు వచ్చినటువంటి ఈయన గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి.గత కొద్ది రోజులుగా పల్లవి ప్రశాంత్ బర్రెలక్క ఇద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

ఇలా వీరి పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి తరుణంలో ఇదివరకే శిరీష స్పందించిన సంగతి తెలిసిందే.తాజాగా పల్లవి ప్రశాంత్ కూడా ఈ వార్తలపై స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మీరు చెప్పే దాకా ఈ వార్త ప్రచారం లో ఉందనే విషయం కూడా నాకు తెలియదు.

బర్రెలక్క శిరీష అంటే నాకు ఎంతో గౌరవం.నాలాగే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి జనాలకు మంచి చెయ్యాలని అనుకుంటుంది, ఆమెని నేను నా చెల్లిగా భావించాను నా చెల్లికి జీవితంలో ఏం అవసరం వచ్చినా నేను తనకు సహాయంగా నిలుస్తానని ప్రశాంత్ తెలిపారు.

ఇలా మా మధ్య మీరందరూ క్రియేట్ చేసినటువంటి బంధం కాకుండా అన్నాచెల్లెల బంధం ఉంది అంటూ వీరిద్దరూ ఈ వార్తలపై స్పందించి ఈ తప్పుడు వార్తలను పూర్తిగా ఖండించారు.ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు