బిగ్ బాస్( Bigg Boss )కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారిలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashanth ) ఒకరు.
కామన్ మాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి పల్లవి ప్రశాంత్ తన అద్భుతమైన ఆట తీరుతో రోజురోజుకు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కొనసాగుతూ చివరికి టైటిల్ రేస్ కి చేరుకున్నారు.అనూహ్యంగా ఈ కార్యక్రమంలో పల్లవి ప్రశాంత్ విన్నర్ (Winner) గా నిలిచారు.
ఇక ఈ కార్యక్రమం కొనసాగుతున్న సమయంలోనే బిగ్ బాస్ విన్నర్ గా గెలిస్తే ఆ డబ్బుతో ఎవరు ఏం చేస్తారనే విషయం గురించి బిగ్ బాస్ అందరిని అడిగారు.
ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత బిగ్ బాస్ లో తాను విన్నర్ గా నిలిచిన తరువాత వచ్చిన ప్రైజ్ మనీ( Prize Money ) మొత్తం పేద రైతులకే పంచుతానని తెలిపారు.ఇక ఈ కార్యక్రమంలో గెలిసినందుకు పల్లవి ప్రశాంత్ కు 15 లక్షల డైమండ్ నెక్లెస్ 15 లక్షల విలువ చేసే కారు బహుమతిగా ఇచ్చారు.యావర్ 15 తీసుకొని బయటకు రావడంతో పల్లవి ప్రశాంత్ కు ప్రైజ్ మనీ కేవలం 35 లక్షల రూపాయలు మాత్రమే వచ్చింది.
ఇక బిగ్ బాస్ ద్వారా గెలిచిన డబ్బుతో రైతులకు సహాయం చేస్తానని చెప్పినటువంటి ఈయన ఇప్పటివరకు డబ్బులు రైతులకు పంచకపోవడంతో ఇచ్చిన మాట తప్పారు అంటూ ఈయన పై ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి.తాజాగా ఈ విమర్శలపై పల్లవి ప్రశాంత్ స్పందించారు.నా ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పననీ తెలిపారు.
త్వరలోనే బిగ్ బాస్ ద్వారా గెలిచిన ఆ డబ్బులు రైతులకు పంచబోతున్నానని తెలిపారు.అయితే ఈయన గెలిచిన 35 లక్షల రూపాయలలో ట్యాక్స్ పోయి కేవలం తనకు 16 లక్షలు మాత్రమే వచ్చిందని ఆ 16 లక్షలు రైతులకు పంచబోతున్నారని తెలుస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy