సంక్షోభంలో పాకిస్థాన్.. ఐదో ఆర్థిక మంత్రి రాజీనామా..

పాకిస్థాన్ సంక్షోభంలో చిక్కుకుంది.గత కొన్నేళ్లుగా ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.

ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు ఇటీవల వచ్చిన భారీ వరదల నేపథ్యంలో పాక్ ఉక్కరిబిక్కిరి అవుతోంది.

ఈ క్రమంలోనే ఆ దేశ ఆర్థిక మంత్రి ఇస్మాయిల్ రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారని తెలుస్తోంది.

నాలుగేళ్ల వ్యవధిలో ఐదో ఆర్థిక మంత్రి పదవిని వీడుతుండటం గమనార్హం.ఆర్థిక మంత్రిగా ఇప్పటికే మౌఖికంగా రాజీనామా చేశానన్న మిఫ్తా ఇస్మాయిల్.

విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే లిఖిత పూర్వకంగా రాజీనామా చేస్తానని ప్రకటించారు.ఇటీవల ఇంధన ధరల పెంపుతో పాటు పలు కీలక అంశాలపై ఇస్మాయిల్ తీసుకున్న నిర్ణయాలపై మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

ఈ క్రమంలోనే ఇస్మాయిల్ రాజీనామా చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.

అంగారకుడిని ఎరుపు రంగు గ్రహంని ఎందుకు పిలుస్తారో తెలుసా?
Advertisement