పాక్ వెబ్ సైట్లకి భారతీయుల స్వాతంత్ర దినోత్సవ బహుమానం!

మత ప్రాతిపదికన ఏర్పడిన పాకిస్తాన్ తమ దేశంలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి వంటి అంశాలను పక్కనపెట్టి భారత పై అక్కడ ప్రజలలో విషం నింపడం పై మాత్రమే దృష్టి సారించింది.

అందుకే ప్రస్తుతం ఫెయిల్డ్ నేషన్స్ లో ఒకటిగా నిలిచింది.

అయినప్పటికీ బుద్ధి మార్చుకొని పాకిస్తాన్ అంతర్జాతీయ ఫోరమ్స్ లో భారత్ పై పడి ఏడవడమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతుంది.అలాంటి పాకిస్తాన్ కు భారత్ గత కొంతకాలంగా బోర్డర్ లోనే కాక ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లో కూడా బుద్ధి చెబుతుంది.

Indians Given Shock To Pakistanis, Pakistan,India, Websites, Indian National Ant

అయినా పాకిస్తాన్ మాత్రం మారకుండా భారత్ ను ఇరుకున పెట్టడానికి తన సవతి సోదరుడు చైనాతో కలిసి ఎత్తులు వేస్తుంది.అందుకే ఈసారి ప్రభుత్వంతో సంబంధం లేకుండా భారతీయులు పాకిస్తాన్ కు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మంచి గిఫ్ట్ ఇచ్చారు.

ఇంతకీ అదేంటంటే పాకిస్తాన్ కు సంబంధం ఉన్న సుమారు 130 సైట్స్ ను భారత్ ఎథికల్ హాకర్లు హ్యాక్ చేశారు.వాళ్ళు హ్యాక్ చేసిన సైట్స్ లో మన దేశ జాతీయ జెండా మరియు జాతీయ గీతం ప్లే అయ్యేలా చేశారు.

Advertisement

ఎప్పుడూ అక్కడి ప్రజల్లో భారత్ పై విష బీజాలు నాటే పాకిస్థాన్ ప్రభుత్వానికి ఈ సంఘటన చెంప పెట్టులా నిలిచింది.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు