చైనా పరువు గంగపాలు.. ఈ వీడియో చూస్తే డ్రాగన్ కంట్రీపై అభిప్రాయం మారిపోతుంది!

పాకిస్థానీ డాక్టర్,( Pakistani Doctor ) కంటెంట్ క్రియేటర్ ఫానీ( Fani ) చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది.

చైనా( China ) పర్యటనకు వెళ్లిన ఫానీ, అక్కడ తన అనుభవాలను పంచుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

చైనాలో అడుగుపెట్టిన వెంటనే తనను ఒక భరించలేని దుర్వాసన చుట్టుముట్టిందని, అది తనను అనారోగ్యానికి గురిచేసిందని సదరు డాక్టర్ వైరల్ వీడియోలో( Viral Video ) చెప్పుకొచ్చాడు.దుబాయ్ నుంచి వచ్చినా, ఆ దారుణమైన వాసన తన పర్యటన అంతటా వెంటాడిందని ఫానీ వాపోయారు.

అయితే, కొంతకాలం అక్కడ జీవించిన తర్వాత ఆ వాసనకు అలవాటు పడ్డానని కూడా చెప్పుకొచ్చాడు.దుర్వాసనలు( Bad Smell ) కేవలం చైనాకే పరిమితం కాదని, గతంలో కొన్ని యూరోపియన్ దేశాలలో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని ఫానీ తన వీడియోలో వెల్లడించాడు.

అయితే, ఫానీ చేసిన ఈ కామెంట్స్‌పై నెటిజన్లు భగ్గుమంటున్నారు.చాలామంది ఆయన వ్యాఖ్యలను అవమానకరంగా భావిస్తూ తీవ్రంగా విమర్శిస్తున్నారు.కొందరు ఆయన వాదనలను ఖండిస్తూ, చైనా పరిశుభ్రతను సమర్థిస్తున్నారు.

Advertisement

"చైనా చాలా పరిశుభ్రంగా ఉంటుంది.అక్కడి ప్రజలు శుచిగా ఉంటారు.

నేను చాలా ఏళ్లుగా అక్కడ ఉన్నాను, ఎప్పుడూ అలాంటి దుర్వాసనను చూడలేదు," అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు.

"మిమ్మల్ని ఆహ్వానించిన దేశాన్ని విమర్శించడం తప్పు.కాస్త గౌరవం చూపించండి," అని మరొకరు హితవు పలికారు."ఇవన్నీ అబద్ధాలు.

నేను ఐదేళ్లకు పైగా చైనాలో ఉన్నాను, నాకు ఎప్పుడూ ఇలాంటి సమస్య రాలేదు," అని ఇంకొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు."నేను రెండేళ్లుగా చైనాలో ఉన్నాను, అలాంటి వాసన నేనెప్పుడూ గమనించలేదు.

హీరో ప్రభాస్ కి ఆ ఫోబియా ఉందా... అందుకే అలాంటి పాత్రలలో చెయ్యరా?
చైనీస్ వెబ్‌సైట్లను నమ్మితే అంతే.. డ్రిల్ ఆర్డర్ చేస్తే ఏమొచ్చిందో చూడండి..

అక్కడి ప్రజలు శుభ్రంగా, మర్యాదగా ఉంటారు," అని మరో వ్యక్తి స్పష్టం చేశారు.తనను తాను "నిజమైన హస్లర్" అని పిలుచుకునే ఫానీకి యూట్యూబ్‌లో 23 వేలకు పైగా సబ్‌స్క్రైబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 400 మంది ఫాలోవర్లు ఉన్నారు.

Advertisement

ఈ ఎంబీబీఎస్ డాక్టర్ తాజా వ్యాఖ్యలు ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి.

తాజా వార్తలు