వైరల్: పాక్ మహిళ ఉదారం... ఓ కడుపు నింపి వారి ముఖాల్లో చిరునవ్వులు చిందించింది!

సోషల్ మీడియాలో ఒక్కోసారి వైరల్ అవుతున్న వీడియోలు చూస్తే మనసు ద్రవిస్తుంది.అదేవిధంగా తాజాగా వైరల్ అవుతున్న ఓ పాక్ మహిళా( Pakistan Woman ) వీడియోని చూసి భారతీయులు సైతం ఫిదా అయిపోయారు అంటే మీరు నమ్ముతారా? నేడు పాకిస్తాన్‌ ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందో అందరికీ తెలిసినదే.ఆ దేశంలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి.ఆకలితో ఉన్న వారికి పట్టెడన్నం పెడితే వారి మనసంతా కృతజ్ఞతతో నిండిపోతుందనే సంగతి అందరికీ తెలిసినదే.ఈ నేపథ్యంలోనే రోడ్డుపై విచారంగా కూర్చుని బెలూన్లు అమ్ముకునే ఓ వికలాంగ బాలుడి ముఖంలో చిరునవ్వులు పూయించింది ఓ యువతి.

 Pakistan Woman Makes Specially Abled Balloon Seller Happy With Biryani Details,-TeluguStop.com

వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి చూస్తే, రోడ్డుపై బెలూన్లు అమ్ముకుంటూ క్రిష్‌ ( Krish ) అనే వికలాంగుడైన బాలుడు దిగులుగా కూర్చున్నాడు.సడెన్ గా ఆ బాలుడి దగ్గరికి ఓ కారు వచ్చి ఆగుతుంది.తరువాత కారులో నుంచి ఓ యువతి బిర్యానీ ప్యాకెట్‌( Biryani Packet ) ఇస్తుంది.

ఆ ప్యాకెట్‌తోపాటు బిస్కెట్‌ ప్యాకెట్‌, కొన్ని చాక్లెట్లు క్రిష్‌కి ఇస్తుంది.అవన్నీ ఓ కవర్లో ప్యాక్‌ చేస్తూ బాలుడి పేరు, బెలూన్లు ఆ యువతి అడగడం మనకు స్పష్టంగా కనిపిస్తోంది.

అనంతరం ఆమెకు అవసరం లేకపోయినా క్రిష్‌ దగ్గరున్న బెలూన్లన్నీ కొనుగోలు చేసి ఫుడ్‌ ప్యాకెట్‌తోపాటు కొంత డబ్బు కూడా ఇస్తుంది.

దాంతో క్రిష్‌ ఆనందంతో గెంతులు వేయడం ఈ వీడియోలో మనకు కనబడుతుంది.కృతజ్ఞతతో క్రిష్‌ తన చేతితో యువతి బుగ్గలు తాకి ఫ్రైయింగ్‌ కిస్‌ కూడా ఇవ్వడం చూడవచ్చు.కాగా ఆకలితో కూర్చున్న బాలుడి ముఖంలో ఆనందం వెల్లివిరిసేలా సదరు యువతి చర్యను నెటిజన్లు ఆకాశానికెత్తేస్తున్నారు.

నిజానికి ఈ వీడియోలోని యువతి పేరు ఫైజా నయీమ్‌. ఆమె పాకిస్థాన్‌లో కౌన్సెలర్, హిప్నాటిస్ట్, సోషల్‌ యాక్టివిస్ట్‌, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా కూడా ఆమె పని చేస్తున్నారు.

‘బెస్ట్‌ మూమెంట్‌ ఆఫ్‌ మై లైఫ్‌’ అనే క్యాప్షన్‌తో ఫైజా నయీమ్( Faiza Naeem ) తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు చేసిన ఈ వీడియోకు 16 మిలియన్లకుపైగా వీక్షణలు, లక్షల్లో కామెంట్లు రావడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube