నా సినిమాకు అవార్డ్స్ రాకుండా అడ్డుకున్నారు.. పా రంజిత్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

కోలీవుడ్ దర్శకుడు పా.రంజిత్( Pa Ranjith ) గురించి మనందరికీ తెలిసిందే.

ఈయన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు ఇతర విషయాలలో కూడా సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటారు.అందులో భాగంగానే ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డులపై( National Awards ) ఆయన కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

తన సినిమాకు జాతీయ అవార్డును రాకుండా అడ్డుకున్నారు అని ఆయన ఆరోపించారు.చాలావరకు రంజిత్ తెరకెక్కించే సినిమాలలో రాజకీయాలు కచ్చితంగా ఉంటాయి.

కనీసం రాజకీయ అంశం అయినా ఆయన సినిమాలలో టచ్ అవుతూ ఉంటుంది.అవి సామాజిక సమస్యలను ప్రశ్నించేవిగా ఉంటాయి.

Pa Ranjith Comment National Awards Details, Pa Ranjith, Pa Ranjith Comments Vira
Advertisement
Pa Ranjith Comment National Awards Details, Pa Ranjith, Pa Ranjith Comments Vira

సినిమాల ద్వారా రాజకీయాలను మాట్లాడతానని పా.రంజిత్‌ ఇటీవల స్ఫష్టంగానే చెప్పారు.ఈయన తాజాగా విక్రమ్‌( Vikram ) కథానాయకుడిగా తెరకెక్కించిన తంగలాన్‌( Thangalaan ) చిత్రం విశేష ఆదరణతో ప్రదర్శింపబడుతోంది.

తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఇంతకుముందు ఆర్య హీరోగా నటించిన సార్పట్ట పరంపర చిత్రం కూడా మంచి విజయం సాధించింది.దీనికి సీక్వెల్‌ కూడా చేస్తానని దర్శకుడు ప్రకటించారు.

కాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులపై స్పందించిన దర్శకుడు పా.రంజిత్‌ సార్పట్ట పరంపర( Sarpatta Parampara Movie ) చిత్రానికి అవార్డు రాకుండా అడ్డుకున్నారనే ఆరోపించారు.దీని గురించి ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రాజకీయాల కారణంగానే తనను తన పని చేసుకోకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

Pa Ranjith Comment National Awards Details, Pa Ranjith, Pa Ranjith Comments Vira

సార్పట్ట పరంపర చాలా పెద్ద విజయాన్ని సాధించిందని అన్నారు.ఈ చిత్ర రెండో భాగం గురించి పలు విమర్శలు వచ్చాయని తెలిపారు.అయితే, అవార్డులకు సార్పట్ట పరంపర చిత్రం బహిరంగంగానే నిరాకరణకు గురైందని అన్నారు.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

పలు క్రిటిక్స్‌ అవార్డులను ఈ చిత్రం పొందిందని తెలిపారు.అలా క్రిటిక్స్‌ అవార్డులను పొందిన చిత్రాలకు కచ్చితంగా జాతీయ అవార్డులు అందిస్తారని అన్నారు.

Advertisement

అయితే సార్పట్ట పరంపర చిత్రాన్ని జాతీయ అవార్డుల దరిదాపుల్లోకే వెళ్లలేకపోయిందని అన్నారు.ఆ అవార్డులకు సార్పట్ట పరంపర చిత్రానికి అర్హత లేదా అని ఆయన ప్రశ్నించారు.

తన భావాలను ప్రామాణికంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిరాకరించారనే ఆరోపణను చేశారు.కావాలనే తన పనిని గుర్తించకూడదని కొందరు పనికట్టుకుని చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన ఆరోపణలు కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజా వార్తలు