జామ పండ్ల సాగులో ఎరువుల యాజమాన్యం.. అధిక దిగుబడి కోసం మెలకువలు..!

జామ తోటలను మిగతా పండ్ల తోటలతో పోలిస్తే శ్రమ తక్కువగా ఉండి ఆదాయం ఆశించిన స్థాయిలో ఉంటుంది.సాగు చేసిన రెండు సంవత్సరాల కు దిగుబడి చేతికి వస్తుంది.

 Ownership Of Fertilizers In The Cultivation Of Guava Fruit.. Wake Up For High Yi-TeluguStop.com

కొన్ని మెళుకువలు పాటిస్తూ సరైన క్రమంలో ఎరువులను అందిస్తే నాణ్యతతో కూడిన దిగుబడి వస్తుంది.పంట వేసే ముందు భూమిని లోతుగా రెండు లేదా మూడుసార్లు దుక్కి దున్నుకోవాలి.

జామ మొక్కలు( Guava ) నాటిన తర్వాత నీటిని పారించకుండా డ్రిప్ పద్ధతి ద్వారా నీరు అందిస్తే దాదాపుగా కలుపు సమస్య ఉండదు.మొక్కలు నాటిన నెల తర్వాత బ్లైటాక్స్( Blitox ) రావణాన్ని మొక్కలు తడిచే విధంగా పిచికారి చేయాలి.

కేవలం నెలకు ఒకసారి ఈ ద్రావణాన్ని పిచికారి చేస్తే, ఇతర క్రిమిసంహారక మందులు వాడాల్సిన అవసరం ఉండదు.ఇంకా మొక్క యొక్క తల భాగం కత్తిరించడం వల్ల కింది భాగంలో పిలకలు ఎక్కువగా వచ్చి చెట్టుకు కొమ్మలు అధికంగా ఉండడంతో దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది.

ఎరువుల విషయానికి వస్తే పశువుల ఎరువుకు అధిక ప్రాముఖ్యత ఇవ్వాలి.ఒక గుంతలో రెండు కార్బో ప్యూరాన్ గుళికలతో పాటు పశువుల ఎరువులు వేయడం వల్ల మొక్కలు నాటిన 45 రోజుల లోపు దాదాపు 50 సెంటీమీటర్ల మేర ఎత్తుకు పెరుగుతాయి.30 నుంచి 35 సెంటీమీటర్లు ఉండేటట్లు మొక్కల తలలను కత్తిరించాలి.ఇలా తలలు కత్తిరించే సమయంలో 19:19:19 ఎరువులు ఎకరాకు 25 కిలోలు డిప్ పద్ధతి ద్వారా అందిస్తే చాలు.

Telugu Agriculture, Blitox, Farmers, Fertilizers, Guava, Guava Fruit, Latest Tel

ఇంకా 50 కిలోల యూరియా, 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్( Super phosphate ) లను డ్రిప్ ద్వారా మొక్కలకు అందించాలి.ఇలా పంట కోత వచ్చిన ప్రతిసారి చేయాల్సి ఉంటుంది.మొదట కాపుకు కాస్త పెట్టుబడి ఎక్కువగానే ఉంటుంది.రెండవ కాపు సమయంలో పెట్టుబడి చాలా తక్కువగా అవసరం అవుతుంది.ఆరు నెలలకు ఒకసారి ఆకులను తుంచడం వల్ల, నేలపై రాలిన ఆకులు కుళ్ళి సేంద్రియ ఎరువుగా మారి మొక్కలకు పోషణ అందిస్తాయి.పైన చెప్పిన మెలకువలను కోత కోసిన ప్రతిసారి క్రమం తప్పకుండా పాటిస్తే ఎకరాకు దాదాపు 10 టన్నుల వరకు దిగుబడి పొందవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube