కాకర పంటలో ఎరువుల యాజమాన్యం.. దిగుబడి పెంచే మెళుకువలు..!

కాకరకాయ( Bitter Gourd ) తీగ జాతి కూరగాయ పంటలను ఒకటి.కాకర పంట అడ్డుపందిరి, శాశ్వత పందిరి పద్ధతిలో అధిక విస్తీర్ణంలో సాగు చేయబడుతోంది.

అయితే తీగజాతి కూరగాయలను సాగు చేసే రైతులు శాశ్వత పై పందిరి ఏర్పాటు చేసుకుంటే ఒకే ఖర్చుతో శాశ్వతంగా తీగ పంటలను సాగు చేయవచ్చు.పైగా ఈ పద్ధతి డ్రిప్ ఇరిగేషన్ కు చాలా అణువుగా ఉంటుంది.

కాకర పంటకు నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, నీరు ఇంకే నేలలు చాలా అణువుగా ఉంటాయి.నేల యొక్క పీహెచ్ విలువ 5.5-6.4 ఉండే నేలలను కాకర పంట సాగుకు ఎంచుకోవాలి.వేసవికాలంలో నేలను లోతు దుక్కులు దున్ని, ఆఖరి దుక్కిలో 10 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు, 25 కిలోల యూరియా, 50 కిలోల DAP, 25 కిలోల పొటాష్ ఎరువులను( Potash fertilizers ) వేసి కలియదున్నాలి.

ఆ తర్వాత పొలంలో ఉండే ఇతర పంటల అవశేషాలను పూర్తిగా తొలగించాలి.

Advertisement

ఒక ఎకరానికి హైబ్రిడ్ విత్తనాలు( Hybrid seeds ) అయితే 500 గ్రాములు, దేశవాళీ రకం విత్తనాలు అయితే ఎనిమిది వందల గ్రాములు అవసరం.మొక్కల మధ్య 50 సెంటీమీటర్ల దూరం, మొక్కల వరుసల మధ్య రెండు మీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకుంటే మొక్కలకు సూర్యరశ్మితో పాటు గాలి బాగా తగిలి ఆరోగ్యకరంగా పెరుగుతాయి.

కాకర నాటిన 20 రోజుల తర్వాత ఒక లీటర్ నీటిలో రెండు గ్రాముల బోరాన్( Boron ) కలిపి పిచికారి చేయాలి.పంటపూత దశలో ఉన్నప్పుడు బోరాన్ పిచికారి చేయడం వల్ల మగ పుష్పాల వృద్ధి తగ్గి, ఆడ పుష్పాల వృద్ధి పెరుగుతుంది.ఇక నీటిని డ్రిప్ విధానం ద్వారా అందించాలి.

ఇలా అందిస్తే పొలంలో కలుపు సమస్య పెద్దగా ఉండదు.దీంతో దాదాపుగా చీడపీడల బెడద తగ్గినట్టే.

సెనేట్ ఆమోదం లేకుండానే కేబినెట్ నియామకాలు.. ట్రంప్ వ్యూహాత్మక ఎత్తుగడ
Advertisement

తాజా వార్తలు