ఉదాసీనతే కేసీఆర్ కొంప ముంచిందా?

తెలంగాణ తెచ్చిన నాయకుడిగా తనను తరచూ చెప్పుకునే కేసీఆర్( KCR ), తెలంగాణ ప్రజల తనకు రుణపడి ఉండాలనన్న తరహాలో తరచూ వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.

ముఖ్యంగా తన పరిపాలనలో తెలంగాణ ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో చెప్పడానికి ఆయన ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారు.

నిజానికి సంఖ్యలపరంగా చూసుకుంటే అవి నిజమే అయినప్పటికీ కూడా కెసిఆర్ పరిపాలన లో కనిపించని ఆత్మగౌరవ అంశం తెలంగాణ ప్రజలను కేసీఆర్కు వ్యతిరేకంగా మారేలా చేసిందని ఇప్పుడు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా ప్రజలకు దూరంగా ఉండటమే ఉండటం, ప్రజాదర్బారు లాంటివి నిర్వహించకపోవడం ప్రజలకు కేసీఆర్ దూరంగా ఉన్నారని, ఒక రాజులా పరిపాలిస్తున్నారని విమర్శలకు అవకాశం ఇచ్చింది .అంతేకాకుండా భారీ ఎత్తున భవనాలు నిర్మించడం, దానికోసం ఇష్టారాజ్యం గా భవంతులు కూల్చి వేయడం , ప్రతిపక్షాలను అసలు లెక్కచెయ్యక పోవడం, వంటివి కెసిఆర్ ది అహంకార పూరిత వైఖరి అంటూ బాగా ప్రచారం జరిగినది .

Overcon Fidence In Kcr Get Damage In Elections , Kcr , Telangana Elections , Ts

తన మంత్రివర్గంపై గాని ఎమ్మెల్యేలపై గాని వస్తున్న విమర్శలను అసలు ఖాతరు చేయకపోవడం వంటివి కేసిఆర్ ప్రజాస్వామ్యనికతీతంగా తనను తాను బావించుకుంటున్నారు అనుకోవడానికి అవకాశం ఇచ్చింది.అంతేకాకుండా తాను తప్ప ఎవరూ గొప్ప నాయకుడు లేడు అన్నట్లుగా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Thummala Nageswara Rao ) వంటి కీలక నాయకులను అవమానించడం కూడా కేసీఆర్ ఓటమిని శాసించినదనే చెప్పాలి ఈ నాయకులు ఖమ్మం జిల్లా(Khammam )లో బారాస ఓటమికి నాంది పలికారు.ముఖ్యంగా బారాసాని ఓడించడానికి సర్వశక్తులను ఓడ్డారు.

అలాగే ప్రభుత్వ వ్యతిరేకతను పట్టించుకోకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలను తిరిగి కొనసాగించాలనే నిర్ణయం బీఆరఎస్ పార్టీకి పెద్ద నష్టంగా అవతరించింది.కేసీఆర్ పై అంతో ఇంతో సానుకూలుత ఉన్నా కూడా స్థానిక నాయకుల పై వ్యతిరేకత బిఆర్ఎస్ ఓటమికి ప్రత్యక్ష కారణంగా ఇప్పుడు చాలామంది విశ్లేషిస్తున్నారు.

Overcon Fidence In Kcr Get Damage In Elections , Kcr , Telangana Elections , Ts
Advertisement
Overcon Fidence In Kcr Get Damage In Elections , Kcr , Telangana Elections , Ts

ఏది ఏమైనా తన పరిపాలనతో తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ దోహద పడినా కూడా ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి వ్యవహార శైలికి భిన్నంగా రాచరిక వ్యవస్థను ప్రవేశపెట్టినందుకే కేసీఆర్ ఈ ఫలితాన్ని అనుభవిస్తున్నారంటూ కూడా రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు .

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు