కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.కాలం చెల్లిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు.
గ్యారెంటీ కార్డులంటూ మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు గ్యారెంటీ కార్డులను అమలు చేసేది లేదని చెప్పారు.
పదవులు రాని వారు పార్టీలు మారుతున్నారని ఎద్దేవా చేశారు.ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గంగిరెద్దుల వాళ్లలా వస్తుంటారని తెలిపారు.
వాళ్ల మాయ మాటలు నమ్మొద్దని సూచించారు.రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనే మరోసారి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.







