ప్రతీ రోజూ సోషల్ మీడియాలో కొన్ని వేల సంఖ్యలో ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి.అయితే వాటిలో కొన్ని మాత్రమే జనాలను ఆకట్టుకుంటాయి.
దాంతో సదరు పోస్టులు వైరల్ అవుతూ ఉంటాయి.తాజాగా వైరల్ అవుతున్న ఓ చిన్నారి ఫొటో చాలా మందిని షాక్ కి గురయ్యేలా చేస్తోంది.
ఆ పాప కాళ్లు( Legs ) అంత సన్నగా మరీ కట్టెపుల్లల్లాగా ఉండడమే దానికి కారణం.మీరు ఇక్కడ ఫొటోను చూస్తేనే అర్ధం అయిపోతుంది కదూ.

అయితే ఒక్కసారి మరలా పరికించి చూడండి ఆ ఫోటో వైపు.వైరల్ అవుతున్న ఆ ఫోటోని సరిగ్గా మీరు గమనిస్తే ఆ ఫొటోలో పాప కాళ్లు సన్నగా లేవని తెలుసుకుంటారు.విషయం ఏమంటే… ఆ పాప పట్టుకున్న పాప్‌కార్న ప్యాకెట్( Popcorn Packet ) వల్ల ఆ చిన్నారి కాళ్లు మీకు అలా కనిపిస్తున్నాయంతే.ఇప్పుడు అర్ధం అయిందా.
మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి అనడానికి ఇదే ఒక ఉదాహరణ అని అంటున్నారు కొంతమంది నెటిజన్లు.

రైన్ మేకర్ 1973 అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.ఆప్టికల్ ఇల్యుజిన్ కి( Optical Illusion ) సంబంధించిన ఇలాంటి ఫొటోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడం మనం గమనించవచ్చు.చాలా ఫొటోలు నెటిజన్లను ఇలా షాక్‌కు గురి చేస్తూ ఉంటాయి.
అయితే ఆ ఫొటోలన్నింటికీ ఇది బాబు అని చెప్పుకోవచ్చు.ఈ మేటర్ చదివే దాకా ఈ ఫొటోలో పజిల్ కనిపెట్టడం కష్టం.
పై ఫొటోను చూసిన చాలా మంది తొలుత ఆ పాపను చూసి జాలిపడ్డారు.ఆ పాప ఏదో అరుదైన వ్యాధితో బాధపడుతోందనుకున్నారు.
ఆ తర్వాత నిజం తెలుసుకుని అవాక్కయ్యారు.కావాలంటే అక్కడ వున్న కామెంట్లను మీరు గమనించవచ్చు.







