తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేసి, ఆ పార్టీ శాశనసభ పక్షంని టీఆర్ఎస్ లో విలీనం చేసుకోవాలనే కేసీఆర్ టార్గెట్ కి దగ్గర అవుతున్నారు.కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే పదిమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరేందుకు రెడీ అవగా, మరో ముగ్గురు త్వరలో వస్తారని అనధికారికంగా వినిపిస్తుంది.
అయితే అందులో ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అధికారికంగా టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు మీడియా ముందుకి వచ్చేసారు.అతను బూపాలపల్లి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గండ్ర వెంకటరామి రెడ్డి.
డీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న గండ్ర బూపలపల్లి ఎమ్మెల్యే గా ప్రస్తుతం ఉన్నారు.కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా అతనికి మంచి గుర్తింపే వుంది.అయితే ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీని వీడటానికి అతను రెడీ కావడం గమనార్హం.సోమవారం రాత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్‌తో గండ్ర, ఆయన సతీమణి జ్యోతి ఇద్దరూ భేటీ అయ్యారు.
వీరు పలు విషయాలపై చర్చించిన అనంతరం టీఆర్ఎస్‌లో చేరాలని గండ్ర దంపతులు నిర్ణయించారు.ఈ మేరకు కేటీఆర్‌తో భేటీ అనంతరం గులాబీ గూటికి వెళ్తున్నట్లు ప్రకటించారు.
అయితే అతని నిర్ణయం మార్చుకోవాలని కాంగ్రెస్ పెద్దలు గండ్రతో మంతనాలు జరిపిన అతను మాత్రం అంగీకరించకపోవడం విశేషం.