అల్లు అర్జున్ సినిమా “పుష్ప” సెట్ లో తీవ్ర విషాదం... ఒకరు మృతి..!!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ “పుష్ప” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో “పుష్ప” సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి.

ముఖ్యంగా "రంగస్థలం" వంటి బ్లాక్ బస్టర్ కొట్టిన సుకుమార్ మంచి ఫామ్ లో వుండటం తో పాటు అల్లు అర్జున్ కూడా "అలా వైకుంఠపురం లో" సినిమా ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకోవడంతో ఈ సినిమాపై మెగా అభిమానులతో పాటు సినీ ప్రేమికులకు కూడా ఇంట్రెస్ట్ నెలకొంది.అంతేకాకుండా సినిమా లో అల్లుఅర్జున్ గతంలో ఎన్నడూ లేనివిధంగా గుబురు గడ్డంతో ఊర మాస్ లుక్ లో ఉండటంతోపాటు సినిమా లో లారీ డ్రైవర్ పాత్రలో గంధపు చెక్కల స్మగ్లర్ గా బన్నీ నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు పెరిగిపోయాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన సెట్లో ఇటీవల తీవ్ర విషాదం నెలకొంది.ఈ సినిమా కోసం పనిచేస్తున్న ప్రముఖ ఫోటోగ్రాఫర్ శ్రీనివాస అనే ఆయన గుండెపోటుతో సినిమా సెట్లో మరణించారు.

గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్.సెట్ లో హఠాత్తుగా పడిపోవడంతో వెంటనే అంబులెన్స్ ద్వారా రాజమండ్రికి తరలిస్తున్న తరుణంలో.

Advertisement
Tragedy In Allu Arjun Pushpa Movie Set...one Died, Pushpa Movie,Allu Arjun,Sukum

మార్గం మధ్యలోనే ఆయన మరణించడం జరిగిందట.

Tragedy In Allu Arjun Pushpa Movie Set...one Died, Pushpa Movie,allu Arjun,sukum

దీంతో ఆయన మరణించడంతో “పుష్ప” యూనిట్ లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.దాదాపు రెండు వందలకు పైగా సినిమాలకు ఫోటోగ్రాఫర్ గా పనిచేసిన శ్రీనివాస్ కి భార్యతో పాటు ఇద్దరు కూతుర్లు ఉన్నారట.దీంతో సినిమా షూటింగ్ మొదలయ్యాక కరోనా వచ్చి కొంతకాలం ఆగిపోయినా షూటింగ్ తాజా ఘటనతో మళ్లీ షూటింగ్ ఆగిపోయినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు