మార్చి నెల ఈ తేదీలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి పుష్ప యాగం..

మన భారతదేశంలోనీ పుణ్యక్షేత్రాలకు ప్రతిరోజు ఎంతోమంది భక్తులు (devotees)తరలివచ్చి భగవంతున్ని దర్శించుకుని సంతోషంగా ఇంటికి వెళుతూ ఉంటారు.

మరి కొంతమంది భక్తులు పూజలు అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు.

ఇంకా చెప్పాలంటే తలనీలాలను మరి కొంత మంది భక్తులు సమర్పించి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు.తాజాగా మార్చి నెల 18వ తేదీన శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి (Sri Kalyana Venkateswara Swamy )వారి దేవాలయంలో శాస్త్రోక్తంగా పుష్పయాగం నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇందుకోసం మార్చి 17వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహించనున్నారు.ఈ దేవాలయంలో ఫిబ్రవరి 11 నుంచి 19 వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు (Annual Brahmotsavams)జరగనున్నాయి.

బ్రహ్మోత్సవాలలో అర్చక పరిచారకులు,అధికార,అనాధికారులు భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు.ఈ యాగం నిర్వహణ వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు.

On This Date In The Month Of March, Sri Kalyana Venkateswara Swamys Pushpa Yaga
Advertisement
On This Date In The Month Of March, Sri Kalyana Venkateswara Swamy's Pushpa Yaga

అయితే మార్చి 18వ తేదీన ఉదయం పది గంటల నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు,చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం కూడా చేస్తారు.మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు పుష్పయాగం ఘనంగా నిర్వహిస్తారు.

అయితే తులసి, చామంతి, గన్నేరు, మొగలి,మల్లె, జాజి సంపంగి, రోజా,కలువలు వంటి చాలా రకాల పుష్పాలతో స్వామి వారికి అభిషేకం నిర్వహిస్తారు.శ్రీవారి పుష్పయాగాన్ని పురస్కరించుకుని మార్చి 18వ తేదీన నిత్య కల్యాణోత్సవం సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.

Advertisement

తాజా వార్తలు