ఢీ జోరుకు బ్రేక్‌ వేయబోతున్న ఓంకార్‌ అన్నయ్య

తెలుగు బుల్లి తెరపై సెన్సేషనల్ రేటింగ్ ని దక్కించుకుంటున్న డాన్స్ షో ఢీ.

ప్రదీప్ హోస్టుగా శేఖర్ మాస్టర్, పూర్ణ మరియు ప్రియమణిలు జడ్జీలుగా సుధీర్ రష్మి మరియు వర్షిని ఆది లు టీం లీడర్ లుగా వ్యవహరిస్తున్నారు.

ఢీ షో గత కొన్నాళ్లుగా టాప్‌ రేటింగ్‌ ను దక్కంచుకుంటూ వచ్చంది.ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ మరియు ఢీ డాన్స్ షో లకు సంబంధించిన రేటింగ్ లను గత కొన్ని సంవత్సరాలుగా మరే ఇతర ఛానల్ కూడా దాటలేక పోతుంది అంటే ఎలాంటి సందేహం లేదు.

Omkar Starting A New Dance Show In Star Maa,Omkar, Dance Show, Star Maa, Dhee Jo

ప్రస్తుతం ఢీ షోకు సంబంధించిన రేటింగ్ మెల్ల మెల్లగా తగ్గుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.ఇలాంటి సమయంలో స్టార్ మా టీవీ లో డాన్స్ ప్లస్ అనే షో ను ఓంకార్ రెడీ చేస్తున్నాడు.

గతంలో ఆట అనే డాన్స్ షో తో సూపర్ హిట్ అయిన ఓంకార్ మళ్లీ దీంతో కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తాడని అంతా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.ఓంకార్ ఏం చేసినా కూడా అది కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది కనుక ఈ డాన్స్ షో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే అభిప్రాయంను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఇప్పటికే ఈ టీవీ కేవలం జబర్దస్త్ మరియు ఢీ డాన్స్ ప్రోగ్రాం లపై ఆధారపడి ఉంది.సీరియల్స్ పెద్దగా నడవట్లేదు.

ఇలాంటి సమయంలో ఢీ కి పోటీగా డాన్స్‌ ప్లస్‌ షో వస్తే ఖచ్చితంగా ఈటీవీ కష్టాల్లో పడే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ డాన్స్ షో కనుక సక్సెస్ అయితే స్టార్ మా ఇక వరుసగా సీజన్లకు సీజన్లు కంటిన్యూ చేయనుంది.

డాన్స్‌ ప్లస్‌ షో కు సంబంధించి ప్రస్తుతం ఆడిషన్స్ జరుగుతున్నాయి.ప్రముఖులు జడ్జీలుగా వ్యవహరించే అవకాశం ఉంది.

ఢీ డాన్స్ షో లో డాన్స్ తో పాటు కామెడీ చేస్తూ ఉంటారు.అందుకే డాన్స్ ప్లస్ షో లో కూడా డాన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేలా ఓంకార్‌ జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు