కరడుకట్టిన ఖైదీలలో మార్పు కోసం అక్కడ ఏం చేస్తున్నారంటే..

బొలీవియా జైళ్లలోని ఖైదీలలో మార్పు కోసం అక్కడి ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టింది.దేశంలోని రోజుల్లో 45 జైళ్లలో 865 మంది ఖైదీలు పుస్తకాలు చదివేలా ప్రోత్సహిస్తున్నారు.

 Olivia Jail Prison Reading Books , Olivia Jail Prison , Reading Books , Olivia-TeluguStop.com

ఈ ప్రోగ్రామ్ పేరు బుక్స్ బిహైండ్ బార్స్.ఇందులో ప్రతి జైలులో ఖైదీల కోసం ఒక లైబ్రరీని ఏర్పాటు చేశారు.

అక్కడవారు కథల పుస్తకాలు మొదలుకొని సైన్స్, చరిత్ర వరకు అన్ని రకాల పుస్తకాలు చదువుతారు.ప్రస్తుతం బొలీవియా జైళ్లలో ఖైదీల చేతుల్లో పుస్తకాలు కనిపిస్తున్నాయి.

వారు ప్రతి పుస్తకం చదివాక వారికో పరీక్ష ఉంటుంది.దాని ప్రయోజనం గురించి వారు చెప్పాల్సివుంటుంది.

పుస్తకాలు వేగంగా చదివే ఖైదీలు కొందరు ఉంటారు.అయితే ఇక్కడి జైళ్లలో ఉండే ఖైదీల్లో ఎక్కువ మంది పెద్దగా చదువుకోలేదు.

కాబట్టి వారికి పుస్తకాలు చదవడంలో కాస్త సమయం పడుతుంది.

పొరుగున ఉన్న బ్రెజిల్‌లో జైలులో కూడా ఇటువంటి కార్యక్రమం చేపట్టారు.

దీంతో జైల్లో ఉన్న ఖైదీలు అధికారుల ముందు మనసు విప్పే అవకాశం కలుగుతోంది.బొలీవియా జైలులో ఈ కార్యక్రమాన్ని ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందంటే.

ఖైదీలు జైలు నుండి బయటకు వెళ్లాక వారు మెరుగైన ప్రవర్తన కలిగివుండాలని జైలు అధికారులు కోరుకుంటున్నారు.బొలీవియాలో ఏ ఖైదీకి జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించరు.

కాగా జైళ్లలో గ్రంథాలయాల ఏర్పాటు అనేది ఈ నాటిది కాదు.అమెరికాలో తొలిసారిగా 1790లో జైలులో లైబ్రరీని ప్రారంభించారు.

ఇప్పుడు పలు సమాఖ్య జైళ్లలో లైబ్రరీలు ఏర్పాటు చేశారు.గతంలో ఖైదీలకు చదవడానికి మతపరమైన పుస్తకాలు మాత్రమే ఇచ్చేవారు.

కానీ తరువాత వారికి అన్ని రకాల పుస్తకాలను ఇస్తూవస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube