లంచం తీసుకోను అని బోర్డు పెట్టిన నిజాయతీ ప్రభుత్వ అధికారి

తెలంగాణలోని అబ్దుల్లాపూర్ మెట్ తహసిల్దార్ విజయ రెడ్డి పై పెట్రోల్ తో ఓ రైతు దాడి చేయడం,ఆ దాడి జరిగిన దగ్గర నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

దీంతో తమపై ఎవరు ఎప్పుడు దాడి చేస్తారో తెలియక భయపడుతూ విధులు నిర్వహిస్తున్నారు.

వాస్తవంగా ప్రభుత్వ కార్యాలయాలల్లో లంచం ఇస్తే గాని ఏ పని ముందుకు కదలదు అనే విషయం జనాలు కూడా బాగా అర్థం అయిపోయింది.లంచాలకు ప్రభుత్వాధికారులు అందరూ బాగా అలవాటు పడిపోయారు.

ప్రస్తుతం చాలా చోట్ల అవినీతి విషయంపై చర్చ తీవ్రంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో నిజాయితీగా పనిచేస్తే వ్యవస్థలో అవినీతి ఉండదని జనాల నుంచి ప్రశంసలు అందుకోవచ్చు అంటూ నిరూపిస్తున్నారు ఓ అధికారి.తాను లంచం తీసుకోను అంటూ ఓ పెద్ద బోర్డును తన కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళితే కరీంనగర్ ఎలక్ట్రిసిటీ సర్కిల్ ఆఫీస్ లో కమర్షియల్ ఏడీఈగా పనిచేస్తున్న తోడేటి అశోక్ నేను లంచం తీసుకోను అంటూ తాను విధులు నిర్వహిస్తున్న ఆఫీసులో బోర్డు పెట్టారు.ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు లంచం తీసుకోకుండా వారిని చైతన్యం చేసేందుకు తాను ఈ విధంగా బోర్డు రాయించాను అని, ప్రతి ఒక్కరు నీతి నిజాయితీలతో పనిచేయాలని అశోక్ చెబుతున్నారు.

Advertisement

నిజంగా ఆయనకు వాట్సాప్ చెప్పాల్సిందే కదా !.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు