సంక్రాంతికి టెండర్ పెట్టిన తారక్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో మరో స్టార్ హీరో రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.అయితే ఈ సినిమా తరువాత తారక్ తన నెక్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

NTR To Start New Movie On Sankranti, NTR, Trivikram, NTR30, Sankranti, Tollywood

గతంలోనే ఈ సినిమాను అఫీషియల్‌గా లాంఛ్ కూడా చేశారు.కానీ ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఏ ఒక్క అప్‌డేట్ కూడా రాలేదు.

దీంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమా షూటింగ్‌ను సంక్రాంతి సందర్భంగా మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Advertisement

ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.సంక్రాంతి సందర్భంగా ఇతర సినిమాల నుండి ఏదో ఒక అప్‌డేట్ వస్తుండటంతో తమ సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని తారక్, త్రివిక్రమ్‌లు భావిస్తున్నారట.

మొత్తానికి తారక్ 30వ చిత్రాన్ని పండగ పూట ప్రారంభిస్తుండటంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇన్ని రోజుల తరువాత తమ అభిమాన హీరో తన నెక్ట్స్ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ను ఇవ్వబోతున్నాడని వారు అంటున్నారు.

అయితే ఎవ్వరూ ఊహించని విధంగా అదే రోజున తారక్-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది.ఒకవేళ ఇదే గనక నిజం అయితే ఇక సంక్రాంతికి తారక్ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదు.

ముక్కు దిబ్బడతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసం!
Advertisement

తాజా వార్తలు