ఎన్టీఆర్‌కు మల్టీస్టారర్‌ పోటీ!

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ఒక భారీ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ చాలా కొత్తగా స్టైలిష్‌గా తయారయ్యాడు.

దాంతో నందమూరి అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా లుక్‌ రివీల్‌ అయ్యింది.

ఆగస్టు 15న మోసన్‌ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.భారీ అంచనాలున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో మల్టీస్టారర్‌ సినిమా ఎన్టీఆర్‌కు పోటీ వచ్చేలా ఉంది.

ఎన్టీఆర్‌ సినిమా వచ్చే సంక్రాంతికే నాగార్జున మరియు కార్తీలు కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్‌ సినిమా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.దాదాపు సంవత్సరం క్రితమే ప్రారంభం అయిన మల్టీస్టారర్‌ అనేక కారణాల వల్ల షూటింగ్‌ ఆలస్యం అయ్యింది.

Advertisement

దాంతో ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్‌ వరకు పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్ణయించాడు.ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ ద్వి భాష మల్టీస్టారర్‌ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా నటిస్తోంది.

సంక్రాంతికి ఈ రెండు సినిమాలు కూడా ఢీ అంటే ఢీ అంటూ బరిలోకి దిగే అవకాశాలున్నాయి.మరి ఈ రెండు పోటీ పడితే ఏది పై చేయి సాధిస్తుందో చూడాలి.

మొదట అనుకున్న ప్రకారం ఈ మల్టీస్టారర్‌లో ఎన్టీఆర్‌ నటించాల్సి ఉంది.కాని చివరి నిమిషంలో కార్తీ వచ్చి చేరాడు.

పెళ్లి చేసుకొని బాత్రూంలు కూడా కడిగిన హీరోయిన్ మోనికా బేడి.. జైలు వరకు ఆమె కష్టాలు ఎన్నో..!
Advertisement