ఎన్టిఆర్ పుట్టిన రోజు కానుకగా సింహాద్రి మూవీ 4k వెర్షన్ రీ -రిలీజ్ - ఫుల్ ఖుషీ లో ఉన్న తారక్ అభిమానులు

యంగ్ టైగెర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ మొదట్లో మాస్ ఇమేజ్ ,స్టార్ డమ్ తెచ్చిపెట్టిన మూవీస్ లో సింహాద్రి మూవీ ఒకటి .

ఇక ఈ సినిమా గురుంచి ఎంత మాట్లాడుకున్నా తక్కువే .

స్టార్ హీరోస్ సినీ కెరీర్ లో కొన్ని సినిమాలు చాల ప్రత్యేకం .ఇక ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మొదటి మూవీ స్టూడెంట్ నెంబర్ 1 ఈ సినిమా తోనే రాజమౌళి టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయము అయ్యారు ,అలానే ఈ మూవీ తో నే ఎన్టీఆర్ స్టార్ హీరోగా ను ఫస్ట్ సక్సెస్ అందుకున్నారు .స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తో ఎన్టిఆర్ - రాజమౌళి ఫ్రెండ్ షిప్ బాగా బలంగా ఏర్పడింది .ఇక ఈ సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టిఆర్ – మాస్ డైరెక్టర్ వి .వి వినాయక కాంబినేషన్ లో ఆది అనే మాస్ మూవీ లో నటించి బిగ్గెస్ట్ మూవీ ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు.ఆది సినిమా తో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నాక , ఆ తరువాత వచ్చిన నాగ , అల్లరి రాముడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించనంత స్థాయి లో విజయం అందుకోలేకపోయాయి.

ఇక రాజమౌళి - ఎన్టిఆర్ కాంబినేషన్ లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా హిట్ సూపర్ హిట్ అయినప్పటికీ, మల్లి యంగ్ టైగెర్ ఎన్టిఆర్ తో ఫుల్ మీల్స్ లాంటి మాస్ మూవీ మూవీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు .ఇక ఆ సమయం రానే వచ్చింది.

ఇక అసలు విషయానికి వస్తే .అసలు సింహాద్రి మూవీ ఎన్టిఆర్ చేయవలసిన మూవీ కాదు ,స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ సింహాద్రి సినిమా నందమూరి బాలకృష్ణ కోసం ఈ కధను సిద్దం చేసుకున్నారు , మాస్ డైరెక్టర్ బి .గోపాల్ డైరెక్షన్ లో బాల కృష్ణ హీరో గా ఈ సినిమా చేద్దాము అని అనుకున్నారు , కాని కొన్ని అనివార్య కారణాలు వల్ల ఈ సినిమా ఆగిపోయింది .సరిగ్గ్గా ఇదే స్టొరీ లో కొన్ని మార్పులు చేసి యంగ్ టైగర్ ఎన్టిఆర్ కు వినిపించారు , అలా ఎన్టిఆర్ ఒకే చెప్పడంతో సింహాద్రి మూవీ మొదలైంది .ఇక ఈ మూవీ జులై 9 2003లో రిలీజ్ అయింది .ఎన్టీర్ హై వోల్టేజ్ యాక్టింగ్ , కీరవాణి మూజిక్ , రాజమౌళి టేకింగ్ , ఇంటర్వెల్ బాంగ్ , భూమిక యాక్టింగ్ ఇలా అన్ని అంశాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకుంది.

Advertisement

ఇక ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రీ రిలీజ్ మూవీస్ ట్రెండ్ నడుస్తుంది .మన స్టార్ హీరోస్ కు సూపర్ హిట్ అందుకున్న సినిమాలు మల్లి అభిమానుల కోసం మల్లి రీ రిలీజ్ చేస్తున్నారు మేకేర్స్ .స్టార్ హీరో పుట్టిన రోజు కానుకగా ఈ ట్రెండ్ మొదలైంది.అయితే కొన్ని క్లాసిక్ హిట్ మూవీస్ ప్రేక్షకుల కోసం మల్లి రీ రిలీజ్ చేస్తే ప్రేక్షకులు అనందిస్తారు అన్న ఉద్దేశం తో నిర్మాతలు ఇలా ప్లాన్ చేస్తున్నారు .రీ రిలీజ్ మూవీస్ కు అదనంగా 4k వెర్షన్ జత చేసి రిలీజ్ చేస్తున్నారు.ఈ నేపధ్యంలో యంగ్ టైగెర్ ఎన్టిఆర్ నటించిన సింహాద్రి సినిమా రీ రిలీజ్ చేయనున్నారు .ఇక ఈ సినిమాను ఎన్టిఆర్ పుట్టిన రోజు సందర్బంగా మే 20న లేదా అంతక ముందు వచ్చే నెల శివ రాత్రి సందర్బంగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది .ఇక ఇందుకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలోనే రాబోతుంది అని టాక్ గట్టిగా వినిపిస్తుంది .

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?
Advertisement

తాజా వార్తలు