యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ బ్యాక్ డ్రాప్ ఇదేనా.. వేరే లెవెల్ లో ప్లాన్ చేశారా?

టాలీవుడ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) ప్రస్తుతం మంచి జోష్ మీద ఉన్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీ తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

ఇటీవల దేవర( Devara ) మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించడంతో అదే ఊపుతో బాలీవుడ్ వార్ 2( War 2 ) సినిమాలో నటించారు.

ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి అయిన విషయం తెలిసిందే.దీంతో ప్రస్తుతం ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ తాంబూలో తెరకెక్కబోయే సినిమాపై దృష్టి పెట్టారు.

ఈ సినిమాకు డ్రాగన్( Dragon ) అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

Ntr Neel Movie In That Background Details, Jr Ntr, Prashanth Neel, Ntr Neel Movi
Advertisement
Ntr Neel Movie In That Background Details, Jr Ntr, Prashanth Neel, Ntr Neel Movi

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ ను హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో స్టార్ట్ చేసారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.( Director Prashanth Neel ) ఈ సినిమాకు సంబందించి అల్లర్లు, షాట్స్ తీస్తున్నారు.నెల రోజులు తారక్ లేని సీన్స్ ను షూట్ చేయనున్నారట.

నెక్స్ట్ మంత్ అనగా మార్చ్ నెలాఖరు నుండి ఎన్టీఆర్ షూట్ లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది.షూట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసి ఎక్కువ భాగం పోస్ట్ ప్రొడక్షన్ పై ఎక్కువ టైం స్పెంట్ చేయబోతున్నారట ప్రశాంత్ నీల్.

కాగా ఈ సినిమా కథ 1960లో బెంగాల్ నేపధ్యంలో సాగుతుందట.ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలో ప్రశాంత్ నీల్ తెలిపాడు.

Ntr Neel Movie In That Background Details, Jr Ntr, Prashanth Neel, Ntr Neel Movi

అందుకు తగ్గట్టే ఎన్టీఆర్‌ ను అత్యంత శక్తివంతమైన పాత్రలో ఆవిష్కరిస్తూ హై ఓల్టేజ్‌ యాక్షన్‌ డ్రామాగా ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడట.ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్( Rukmini Vasanth ) హీరోయిన్‌ గా నటిస్తోంది.కన్నడ సెన్సేషన్ రవి బస్రుర్ ఎన్టీఆర్ నీల్ సినిమాకు సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?

మొత్తంగా చూస్తే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను వేరే లెవెల్ లో ప్లాన్ చేశాడని అర్థం అవుతోంది.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడా అని మొదలవుతుందా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు తాజాగా కొన్ని ఫొటోస్ షేర్ చేసి శుభవార్తను తెలిపారు.

Advertisement

తాజా వార్తలు