NTR30 : ఎన్టీఆర్30 షూటింగ్ మొదలు.. సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన తారక్.. లుక్ తేడాగా ఉందే!

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే.

ఇటీవలె ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.కానీ షూటింగ్ మాత్రం మొదలు పెట్టలేదు.

ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో గ్రాండ్‌ గా ప్రారంభం అయ్యింది.ఇది ఇలా ఉంటే తాజాగా షూటింగ్‌ సెట్‌లోకి అడుగుపెట్టారు ఎన్టీఆర్‌.ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియాలో అభిమానులతో ఒక వీడియోని పంచుకున్నారు.

Advertisement

ఏప్రిల్‌ 1న ఆయన ఎన్టీఆర్‌ 30 సెట్‌లోకి అడుగుపెట్టారు.ఇందులో కొరటాల శివ వేసిన ఓ గ్రాండియర్‌ సెట్‌లో ఎన్టీఆర్‌ ఎంట్రీ ఇస్తున్న దృశ్యాన్ని వీడియో తీసి దాన్ని తారక్‌ తన ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు.

అయితే సెట్‌ లోపల భాగం కోటని తలపించేలా ఉంది.

అయితే ఇది రాత్రి పార్టీ సాంగ్‌ కోసం వేసిన సెట్‌ తరహాలో ఉండటం గమనార్హం.ఇక తారక్‌ బ్యాక్‌ నుంచి ఇందులో కనిపించారు.అందులో ఎన్టీఆర్ పూల పూల షర్ట్ ధరించాడు.

అందుకు సంబందించిన వీడియోని షేర్ చేస్తూ కొరటాల శివతో మళ్లీ సెట్స్ లోకి రావడం గొప్పగా ఉంది అని రాసుకొచ్చారు.ఎన్టీఆర్ సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Garam masala : భారతీయులు ఉపయోగించే గరం మసాలాతో.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..!

కాగా గతంలో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా విడుదలైన విషయం తెలిసింది.ఈ సినిమా మంచి విజయం సాధించడంతో మరోసారి వీళ్లిద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కబోతోంది.

Advertisement

కాగా ఎన్టీఆర్ 30 సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమాని ఎన్టీఆర్‌ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై కళ్యాణ్‌ రామ్‌, మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ కె సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

తాజా వార్తలు