చంద్రబాబు నాయుడు అరెస్ట్( Chandrababu Arrest ) గురించి జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.టీడీపీ సోషల్ మీడియా గ్రూపులలో ఎన్టీఆర్ ను విమర్శిస్తూ కామెంట్లు వైరల్ అవుతున్నాయని తెలుస్తోంది.
తాజాగా ఎన్టీఆర్ సైమా అవార్డ్ ను అందుకోగా ఆ సంతోషం ఏ మాత్రం నిలవలేదని తెలుస్తోంది.నెగిటివ్ కామెంట్లు తారక్ ను హర్ట్ చేశాయని సమాచారం అందుతోంది.

అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్( NTR Fans ) మాత్రం ఎన్టీఆర్ స్పందించడం లేటవ్వచ్చు కానీ స్పందించడం మాత్రం పక్కా అని చెబుతున్నారు.తనపై వచ్చిన విమర్శలకు, తనకు ఎదురైన ప్రశ్నలకు అన్నిటికీ టైమ్ చూసి జవాబు చెబుతాడని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు 2009 సంవత్సరంలో యాక్సిడెంట్ జరిగిందని ఆ సమయంలో చంద్రబాబు కానీ, లోకేశ్( Nara Lokesh ) కానీ టీడీపీ ఇతర ముఖ్య నేతలు కానీ పట్టించుకోలేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెల్లడిస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ తల్లి గురించి చెడుగా ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయని, హరికృష్ణకు టికెట్ ఇవ్వని సందర్భాలు ఉన్నాయని, హరికృష్ణ( Harikrishna ) మరణించిన సమయంలో కూడా చంద్రబాబు కేటీఆర్ తో రాజకీయాల గురించి మాట్లాడారని నెటిజన్లు చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీలో నందమూరి ఫ్యామిలీ( Nandamuri Family )కి ఎంత విలువ ఉందో తెలుసుకోవాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

తారక్ స్పందించాలని కోరుతున్న వాళ్లు తారక్ కు కష్టమొస్తే ఎందుకు స్పందించలేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాడుతున్నారు.ఎవరు తనవాళ్లో ఎవరు మోసం చేస్తున్న వాళ్లో జూనియర్ ఎన్టీఆర్ కు తెలుసని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తారక్ టీడీపీకి( TDP ) వ్యతిరేకంగా నోరు విప్పితే జరిగే నష్టాన్ని కూడా అంచనా వేయాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఎన్టీఆర్ ను పదే పదే టార్గెట్ చేసి పార్టీ నష్టపోయే పరిస్థితిని తీసుకొనిరావద్దని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
