ఎన్టీఆర్ తన బలం చూపించాడు

బాక్సాఫీస్ రికార్డులు ఎన్టీఆర్ కి కొత్త కాదు.అలాగని ఎన్టీఆర్ కొత్తగా కొట్టిన రికార్డులు కుడా లేవు.

ఎన్టీఆర్ ఊపు చివరిసారి 12 సంవత్సరాల క్రితం వచ్చిన సింహాద్రితో చూసాం.అప్పటినుంచి ఎన్టీఆర్ కి మధ్య మధ్యలో హిట్స్ వచ్చినా తన రేంజ్ బ్లాక్బస్టర్ రాలేదు.

NTR Cleared Hurdles For Nannaku Prematho-NTR Cleared Hurdles For Nannaku Premath

ఎన్టీఆర్ రికార్డులు కొడ్తున్నప్పుడు ఒక వర్గం నందమూరి అభిమానులు ఎన్టీఆర్ నందమూరి హీరోగా స్వాగతించలేదు.అప్పటినుంచి తనపై బలప్రయోగం చేస్తూనే వస్తున్నారు.

ఎన్టీఆర్ ప్రతి సినిమాకి ఎదోరకంగా అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు.పేరుకి తాతయ్య వారసుడు అయినా, తన సొంత కష్టంతో నందమూరి కుటుంబానికి వెన్నుముక్కగా నిలిచాడు ఎన్టీఆర్.

Advertisement

అందుకే రికార్డులు, కలెక్షన్లకు అతీతంగా ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడు తన వెంటే ఉన్నారు.ఇక తాజాగా చెప్పాలంటే, రెండురోజుల క్రితం నాన్నకు ప్రేమతో వాయిదా పడుతున్నాట్లు వార్తలు వచ్చాయి.

అందులో ఏమాత్రం అవాస్తవం లేదు.నిజంగానే ఎన్టీఆర్ సినిమాను ఆపేందుకు ప్రయత్నాలు జరిగాయి.

నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ పూర్తిగా చేతులు ఎత్తేసినట్టు సమాచారం.ఆ సమయంలో ఎన్టీఆర్ తన బలాన్ని ప్రయోగించాడు.

పంపిణిదారులతో మాట్లాడాడు.నిర్మాతకు ధైర్యాన్ని ఇచ్చాడు.

Best Foods For Your Skin

సంక్రాంతికే సినిమా వచ్చేటట్లు చూసుకున్నాడు.వెంటనే సినిమా జనవరి 13న విడుదల కానున్నట్లు ప్రెస్ నోట్ వచ్చింది.

Advertisement

ఇక సినిమా విడుదల అయ్యాక నందమూరి అభిమానుల్లో మరిన్ని చీలికలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.ఇప్పుడు జరుగుతున్నా గొడవలు ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

తాజా వార్తలు